Chanakyaniti: భార్యకు ఉండకూడని 3 గుణాలు ఇవే.. ఉన్నాయంటే కుటుంబం మొత్తం కష్టాలపాలే
ఆచార్య చాణక్యుడు మంచి భార్యగా.. భర్తగా ఉండడానికి.. ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. అనే విషయాలను ఎన్నో చెప్పాడు.. అలాగే.. భార్యలో ఉండకూడని గుణాలను కూడా వివరించాడు.. పెళ్లి.. ఆ తర్వాత కుటుంబ బంధంలో స్త్రీ పాత్ర గురించి వివరించాడు.. భర్తతో పోలిస్తే భార్య బాధ్యత చాలా రెట్లు పెరుగుతుందని తెలిపాడు..

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు.. తత్వవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు.. అందుకే ఆయన్ను కౌటిల్యుడుగా పేర్కొంటారు.. అయితే.. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా.. జీవితంలో ఎలా ఎదగాలో బోధించాడు.. వ్యక్తిగత జీవితం నుంచి వివాహ జీవితం.. అలాగే ఎలా ఉండాలి..? ఏ విధంగా ఉండకూడదో నీతిశాస్త్రంలో సవివరంగా వివరించాడు.. అయితే.. చాణక్యుడు మంచి భార్యగా.. భర్తగా ఉండడానికి.. ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. అనే విషయాలను ఎన్నో చెప్పాడు.. అలాగే.. భార్యలో ఉండకూడని గుణాలను కూడా వివరించాడు.. పెళ్లి, కుటుంబ బంధంలో స్త్రీ పాత్ర గురించి వివరించాడు.. భర్తతో పోలిస్తే భార్య బాధ్యత చాలా రెట్లు పెరుగుతుందని తెలిపాడు.. పెళ్లి తర్వాత మహిళల్లో ఉండకూడని విషయాలను చెప్పాడు.. ఆమె ఈ 3 అలవాట్లు కలిగి ఉంటే.. ఆమె తన భర్తను ఎంతగా ప్రేమించినా.. ఇల్లు నాశనం అవుతుందన్నాడు.
ఆచార్య చాణక్యుడు భార్యలో ఉండకూడని లక్షణాల గురించి ఏం చెప్పాడో చూద్దాం..
ఎలాపడితే అలా.. ఏది పడితే అది మాట్లాడేవారు:
కుటుంబ బంధంలో చిన్న చిన్న పొరపాట్లు సహజం.. ఇలాంటి సమయంలో నాలుకపై నియంత్రణ అవసరం.. నాలుకపై నియంత్రణ లేని భార్య (మహిళ) ఎలాంటి ఆలోచన లేకుండా మాట్లాడుతుంది.. ఎప్పుడూ గొడవలు చేస్తుందని.. ఇంటి మొత్తాన్ని దెబ్బతీస్తుందని ఆచార్య చాణక్యుడు వివరించాడు.. అలాంటి భార్య ఉంటే మనశ్శాంతి ఉండదన్నాడు..
తరచూ గొడవపడే భార్య:
భార్యభర్తల బంధంలో మొదట అర్థం చేసుకోవడం ముఖ్యం.. వాదన లేదా పరస్పరం మాట్లాడుకునే ముందు.. అర్థం చేసుకోకుండా.. గొడవపడే స్త్రీ కుటుంబాన్ని సరిగా పోషించదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.. కోపం అనేది సహజం.. కానీ ఇంటి మంచి కోసం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటం మంచిదన్నాడు.. అర్ధం చేసుకోకుండా గొడవపడితే, బంధం పూర్తిగా దెబ్బతింటుందని తెలిపాడు.
అశాంతిని కురుకునే వారు:
భార్య సద్గుణవంతురాలైతే ఆమె తన మొత్తం కుటుంబాన్ని కాపాడుతుందని చాణక్యుడు తెలిపాడు.. గుణం మంచిది కాకుండా.. ఇంట్లో ఎప్పుడూ అశాంతి కలిగించే భార్య ఉంటే.. ఆ కుటుంబం నరకంలా ఉంటుందని తెలిపాడు.. మొత్తం కుటుంబం దెబ్బతింటుందన్నాడు..
భార్య ఈ మూడు విషయాలను వదిలిపెడితే.. ఆ కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. (గమనిక పై సమాచారం ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి నుంచి తీసుకోబడింది.. ఈ వార్త ఉద్దేశ్యం సమాచారాన్ని అందించడం మాత్రమే.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
