Chamomile Flowers Uses: చామంతి పూలతో మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఈ రోగాలకు చెక్!

చామంతి పూల సీజనల్ మొదలై పోయింది. చామంతి పూలు అనగానే చాలా మంది పూజలే గుర్తొస్తాయి. ఈ పూలలో ఎన్నో రకాలు ఉన్నాయి. చామంతి పూల నుంచి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. చాలా మంది ఈ మొక్కలను ఇంటి వద్దనే పెంచుకుంటూ ఉంటారు. ఈ చామంతి పూలతో కేవలం పూజలే కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చామంతి పూలను ఉపయోగించి ఎన్నో బ్యూటీ ప్రోడెక్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇతర టీల లాగానే చామంతి పూలతో కూడా టీ..

Chamomile Flowers Uses: చామంతి పూలతో మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఈ రోగాలకు చెక్!
Chamomile Flowers
Follow us
Chinni Enni

|

Updated on: Sep 08, 2024 | 1:34 PM

చామంతి పూల సీజనల్ మొదలై పోయింది. చామంతి పూలు అనగానే చాలా మంది పూజలే గుర్తొస్తాయి. ఈ పూలలో ఎన్నో రకాలు ఉన్నాయి. చామంతి పూల నుంచి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. చాలా మంది ఈ మొక్కలను ఇంటి వద్దనే పెంచుకుంటూ ఉంటారు. ఈ చామంతి పూలతో కేవలం పూజలే కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చామంతి పూలను ఉపయోగించి ఎన్నో బ్యూటీ ప్రోడెక్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇతర టీల లాగానే చామంతి పూలతో కూడా టీ తయారు చేసుకోవచ్చు. వారంలో ఒక్కసారి ఈ టీ తాగినా బోలెడన్ని ప్రయోజనాలు. మార్కెట్లో కూడా చామంతి పూల టీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. కానీ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ చామంతి పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా సమస్యలను ఈ పూల టీతో తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి మాయం:

చామంతి పూల టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతుంది. ప్రస్తుత జీవిత కాలంలో ఒత్తిడి అనేది సర్వ సాధారణమైనది. అంతే కాకుండా మానసిక సమస్యలతో బాధ పడేవారు కూడా ఈ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి రిలాక్స్ ఇస్తుంది.

నిద్ర సమస్యలు మాయం:

నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు ఈ టీ తాగడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. నిద్ర అనేది మెరుగు పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే గాఢమైన నిద్ర పొందుతారు.కళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు తీసుకోవాలి. వాటిల్లో ఇది కూడా ఒకటి. తరచూ తాగుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరిగి ఇతర సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

చర్మ సమస్యలు మాయం:

చామంతి పూలతో చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఒక కప్పులో ఎండిన చామంతి పువ్వుల పొడి, ఎర్ర కొంది పప్పు పొడి ఒక స్పూన్, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి సున్నితంగా రుద్ది అలా వదిలేయాలి. ఓ పది నిమిషాల తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల.. నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం సాఫ్ట్ గా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..