AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Causes: అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..

క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న ఒక మహమ్మారి. గాలి నుంచి నీరు, ఆహారం వరకు ప్రతిదీ కలుషితమై క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే అది రోగికి ప్రాణాంతకం కాగలదని తెలిసిన విషయమే. అందుకే ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి..

Srilakshmi C
|

Updated on: Feb 11, 2026 | 1:22 PM

Share
క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న ఒక మహమ్మారి. గాలి నుంచి నీరు, ఆహారం వరకు ప్రతిదీ కలుషితమై క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే అది రోగికి ప్రాణాంతకం కాగలదని తెలిసిన విషయమే. అందుకే ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు యేటా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.

1 / 5
క్యాన్సర్‌పై అవగాహనకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4, 2000న జరిగిన ప్రపంచ సదస్సులో అమల్లోకి వచ్చింది. పారిస్‌లో జరిగిన సదస్సులో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UIC) ద్వారా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని తొలిసారి అమలు చేశారు.

2 / 5
వ్యాధి గురించి అవగాహన కల్పించడం, సరైన సమయంలో దానిని గుర్తించడం, నివారణ చర్యల గురించి తెలుసుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యం. క్యాన్సర్ మహమ్మారికి నిర్దిష్ట కారణం లేకపోయినప్పటికీ మారుతున్న జీవనశైలి, ఆహారం దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

3 / 5
ముఖ్యంగా పొగాకు వాడకం, ధూమపానం, మద్యపానం, ఆహారం, విటమిన్ ఎ, సి లోపం, హార్మోన్ల అసమతుల్యత, రసాయన సౌందర్య సాధనాల అధిక వినియోగం, ఇవన్నీ జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు.

4 / 5
అయితే క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన చికిత్స చేస్తే ఈ మహమ్మారిని కొంతవరకు నివారించవచ్చు. కాబట్టి వీటి గురించి తెలుసుకుని, ప్రారంభంలోనే లక్షణాలను గుర్తించి దానిని నివారించడం మంచిది.

5 / 5