Cancer in Summer: ఎండలో ఎక్కువ సేపు ఉంటే క్యాన్సర్ వస్తుందా? తెలుసుకోండి..
బయట ఎండలు మండి పోతున్నాయి. భగభగమండే ఎండలతో జనం అల్లాడి పోతున్నారు. ఉదయం 9 గంటలకే వేడి పెరిగిపోతుంది. దీంతో జనం బయట తిరగడానికి భయపడి పోతున్నారు. కాసేపు ఎండలో నిల్చకుంటే.. చర్మం కాలి పోతున్నట్టుగా ఉంటుంది. సన్ బర్న్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ సన్ బర్న్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సన్ బర్న్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందని చెబుతున్నారు. ఎవరైనా సరే ఎక్కువ సేపు..

బయట ఎండలు మండి పోతున్నాయి. భగభగమండే ఎండలతో జనం అల్లాడి పోతున్నారు. ఉదయం 9 గంటలకే వేడి పెరిగిపోతుంది. దీంతో జనం బయట తిరగడానికి భయపడి పోతున్నారు. కాసేపు ఎండలో నిల్చకుంటే.. చర్మం కాలి పోతున్నట్టుగా ఉంటుంది. సన్ బర్న్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ సన్ బర్న్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సన్ బర్న్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందని చెబుతున్నారు. ఎవరైనా సరే ఎక్కువ సేపు ఎండలో ఉంటే సూర్యుని కిరణాల రేడియేషన్ ద్వారా చర్మ కణ జాలంలోని డీఎన్‌ఏకు హాని కలుగుతుందట. దీంతో మ్యూటేషన్ జరవచ్చు. ఇది క్యాన్సర్ కు కారణం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎండల్లో ఎక్కువ సేపు పని చేసేవారు.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరి ఎండల్లో ఎక్కువ సేపు ఉంటే ఎలాంటి క్యాన్సర్‌లు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.
మెలినోమా క్యాన్సర్:
ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్. ఎండల్లో ఎక్కువ సేపు అదే పనిగా ఉంటే.. ఈ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దీనికి కేవలం సర్జరీ మాత్రమే చికిత్స. ఆ తర్వాత కీమో థెరపీ, రేడియో థెరపీ చేస్తారు.
బేసల్ సెల్ కార్సినోమా క్యాన్సర్:
సూర్య కిరణాల వల్ల తలెత్తే.. చర్మ క్యాన్సర్‌లలో ఈ రకమైన క్యాన్సర్ కూడా ఒకటి. ఇది ఎక్కువగా ముఖం, పెదవి, ముక్కు, చెవి భుజాలు, చేతులు వంటి ప్రదేశాల్లో వస్తుంది. దీనికి కూడా చికిత్స అందుబాటులో ఉంది. సర్జరీ, రేడియో థెరపీ ద్వారా చికిత్స చేస్తారు.
స్క్రామస్ సెల్ కార్సినోమా క్యాన్సర్:
చర్మ క్యాన్సర్‌లలో ఇది కూడా ఒకటి. ఎండలో ఎక్కువ సేపు ఉండేవారికి ఈ క్యాన్సర్ కూడా వస్తుంది. ఎండకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అయ్యే భాగాల్లో ఈ క్యాన్సర్ వస్తుంది. ముఖం, చెవులు, మెడ, చేతులపై రావచ్చు. ఈ క్యాన్సర్‌కు సర్జరీ ద్వారా చికిత్స చేస్తారు.
కాబట్టి ఎండకు వీలైనంత వరకూ దూరంగా ఉండండి. ఎండలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. మీ చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లండి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








