AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్థిక సమస్యలు, అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నారా..? ఇంట్లో ఈ తప్పులు చేస్తే డబ్బు నిలవదు..!

అర్థిక సమస్యలు, అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నారా..? వాస్తు శాస్త్రం కొన్ని మార్పులను సూచిస్తుంది. ఇవి ఇంట్లో శుభ శక్తులను ఆహ్వానించి ఆర్థిక పురోగతికి దోహదం చేస్తాయని చెబుతున్నారు. కొన్ని మార్పులు ఇంట్లో చేయడం ద్వారా మంచివైబ్రేషన్లు పెరిగి సంపద రాక ఆస్కారం కలుగుతుంది.

అర్థిక సమస్యలు, అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నారా..? ఇంట్లో ఈ తప్పులు చేస్తే డబ్బు నిలవదు..!
Vastu Tips For Money
Prashanthi V
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 19, 2025 | 7:50 AM

Share

ఇంటి ప్రవేశద్వారం దగ్గర వేప లేదా మామిడి చెట్లు నాటడం, ఇంట్లో గంగాజలం చల్లడం, పసుపు ముద్దను దిండు కింద ఉంచడం వంటివి అదృష్టాన్ని పెంచుతాయి. మంగళవారం హనుమాన్ పూజ, ఇంటి వంటగదిని శుభ్రంగా ఉంచడం, నైరుతి దిశలో శ్రీమహావిష్ణువు చిత్రాన్ని ఉంచడం కూడా ఆర్థిక పురోగతికి దోహదం చేస్తాయి. ఇంట్లో సరైన మార్పులు చేసి సంపద, శ్రేయస్సు పొందండి.

ఇంట్లో మార్పులు

ఇంటి ప్రవేశద్వారం వద్ద చెట్లు నాటడం, ఇంటి గుమ్మానికి దగ్గరగా మామిడి, వేప లేదా అశోక చెట్లను పెంచడం శుభ ఫలితాలను ఇస్తుంది. వాస్తు ప్రకారం.. ఇవి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి.

గంగాజలం

ప్రతి రోజు సాయంత్రం భగవంతుడిని పూజించినప్పుడు రాగి పాత్రలో గంగాజలాన్ని ఉంచాలి. ఆ తర్వాత ఇంటి నాలుగు మూలల్లో చల్లడం శుభం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పసుపు ముద్ద

రాత్రి పడుకునే ముందు చిన్న పసుపు ముద్దను పసుపు వస్త్రంలో కట్టి దిండు కింద ఉంచడం ద్వారా అదృష్టం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఇది ఆర్థిక స్థిరతను తీసుకువస్తుందని చెబుతారు.

హనుమాన్ పూజ

మంగళవారం హనుమంతుడిని పూజించి, బెల్లం, శనగల ప్రసాదాన్ని సమర్పించాలి. ఆ తర్వాత దానిని ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్ముతారు.

ఇంటి నిర్మాణ జాగ్రత్తలు

ఇంటి నిర్మాణ లోపాలు ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా మరుగుదొడ్డి తగినచోట లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఇంటి ప్రధాన ద్వారం పైన మరుగుదొడ్డి నిర్మించకూడదు.

సరైన ప్రదేశంలో చీపురు

హిందూ సంప్రదాయం ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. దీన్ని ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచకూడదు. అలాగే చెత్త బుట్ట కూడా ఇంటి దక్షిణ-తూర్పు మూలలో పెట్టడం మంచి ఫలితాలను ఇవ్వదు.

పూల మొక్కలు

ఇంటి ఆగ్నేయ దిశలో ఎరుపు రంగు పువ్వుల మొక్కలు నాటడం వల్ల అప్పుల బాధలు తగ్గుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మందారం, గులాబి మొక్కలను పెంచడం శుభప్రదంగా ఉంటుంది.

శ్రీమహావిష్ణువు చిత్రం

ఇంటి నైరుతి దిశలో శ్రీమహావిష్ణువు చిత్రం ఉండాలి. లక్ష్మీదేవి ఆయన పాదాల వద్ద కూర్చుని ఉన్న చిత్రాన్ని పెట్టడం మరింత శుభప్రదంగా ఉంటుంది.

క్లీన్ గా కిచెన్

వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా ఇది అగ్ని మూలం కాబట్టి దాన్ని దక్షిణ-తూర్పు మూలలో ఏర్పాటు చేయడం వల్ల వ్యాపార లాభాలు, ధన ప్రవాహం పెరుగుతాయని నమ్ముతారు.

ఇంట్లో మురికి నీరు

ఇంటి బ్రహ్మ స్థానం గుండా మురికి నీరు పోయకూడదు. ఇది ఆర్థిక నష్టాలకు కారణమవుతుందని చెబుతారు.

శివపార్వతి ఫోటో

పూజ గదిలో శివుడిని కుటుంబ సమేతంగా చూపించే ఫోటో ఉంచడం ద్వారా కుటుంబంలో కలహాలు తగ్గి, ఆర్థికంగా పురోగతి సాధించవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న చిన్న మార్పులు ఇంట్లో అమలు చేస్తే శుభ శక్తులు పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..