Health Tips: రోజుకో లవంగం తింటే డాక్టర్‌తో పనిలేదు.. ఆ సమస్యలన్నీ పరార్
లవంగాలను నమిలినప్పుడు విడుదలయ్యే లాలాజలం పొట్టలోని ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. పేగుల్లో ఉండే బ్యాక్టీరియా దగ్గరి నుంచి గొంతు నొప్పిని కలుగజేసే బ్యాక్టీరియా వరకు ఎన్నో రకాల సమస్యలకు లవంగం మంచి విరుగుడుగా పనిచేస్తుంది. రోజుకో లవంగం తినడం వల్ల షుగర్, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు..

ప్రతి రోజూ ఒక లవంగాన్ని నోట్లో వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆయుర్వేదం చెప్తోంది. వీటిని రోజూవారి డైట్ లో చేర్చుకోవడం ఎందుకు అవసరమో తెలుసుకుందాం..
పంటి నొప్పికి….
లవంగాలను పంటి నొప్పి నివారణకు ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తుంటారు. టూత్ పేస్టులు, ఔషధాల్లోనే లవంగం నూనెను వాడుతుంటారు. పంటి నొప్పి తీవ్రంగా బాధిస్తుంటే ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఎన్నో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అవి నొప్పికి సంబంధించిన కారకాలతో ఫైట్ చేస్తాయి.
నోటి దుర్వాసనకు..
నోటి నుంచి తరచూ దుర్వాసన వస్తున్న సమస్యతో బాధపడేవారికి లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలను నోట్లో వేసుకుని నమిలినా, వీటిని చప్పరించినా నోటి దుర్వాసన వెంటనే తగ్గుతుంది. నోరు తాజాగా మారుతుంది. హాలిటోసిస్ ను నయం చేస్తుంది.
చిగుళ్ల నుంచి రక్తం..
లవంగాలు నోటిలోని ఏ రకమైన సమస్యనైనా నయం చేయగలవు. ఇది చిగుర్ల జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చిగుళ్ల వాపును తగ్గించి, రక్తస్రావాన్ని అరికడుతుంది.
అజీర్తికి..
పిల్లలు, పెద్దలు ఇలా అప్పుడప్పుడూ అజీర్తి సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఇలాగే వదిలేస్తే కడుపు ఉబ్బినట్టుగా మారి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తద్వారా కడుపునొప్పి, తల తిరగడం వంటివి కూడా మొదలవుతాయి. ఇలా ఎప్పుడైనా అనిపిస్తే వెంటనే ఓ చిన్న లవంగం నోట్లో వేసుకుంటే సరి. ఇందులోని ఔషధీయ గుణాలు అజీర్తి సమస్యల నుంచి రక్షిస్తాయి.
పోషకాలు ఒంటికి పట్టేలా..
అంతేకాదు లవంగాలు నమలడం వల్ల డైజెస్టివ్ ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. తద్వారా ఇవి మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించగలిగేలా చేస్తాయి.
తీవ్రమైన దగ్గుకు..
తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న వారికి లవంగం ఇచ్చి చూడండి. ఇందులోని బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు దగ్గు నుంచి రిలీఫ్ నిస్తాయి.
గొంతునొప్పి వేధింస్తుంటే..
గొంతునొప్పి వేధిస్తుంటే లవంగంతో చేసిన టీని కానీ, లవంగం నేరుగా నమలడం కానీ చేయండి. ఇది గొంతులో ఉండే బ్యాక్టీరియాను తగ్గించి గొంతునొప్పిని తగ్గేలా చేస్తుంది.
ఇన్ఫెక్షన్లు దూరం..
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీల వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడటమే కాకుండా ఓవరాల్ హెల్త్ విషయంలోనూ ఎంతో ప్రభావవంతంగా ఉంచుతుంది.
స్ట్రెస్ ను తగ్గించేలా..
లవంగంలో స్ట్రెస్ ను, యాంగ్జైటీని విడుదల చేసే గుణాలున్నాయి. ఇది వెంటనే ఆందోళనను తగ్గించి మనసును నెమ్మదించేలా చేస్తుంది.
తరచూ అనారోగ్యమా..?
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు తరుచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. అలాంటి వారికి లవంగాలు గొప్పగా పనిచేస్తాయి. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచి ఈ వ్యవస్థను బలంగా చేసే ఎన్నో రకాల ప్రాపర్టీలున్నాయి.




