AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lizards: వార్నీ.. ఇంట్లో బల్లులు ఉండడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇది తెలీక ఇన్నాళ్లు..

Benefits of Home Lizards: సాధారణంగా ఇంట్లోకి బల్లలు రావడం కామన్. కానీ చాలా మంది వాటిని తరిమికొడుతుంటారు. ఎందుకంటే ఇంట్లో బల్లులు ఉండడం కొందరు అశుభంగా భావిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయాలేమిటంటే ఇంట్లో బల్లి ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవును నిజం.. అవేంటో ఇప్పుడు తెలసుకుందాం.

Lizards: వార్నీ.. ఇంట్లో బల్లులు ఉండడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇది తెలీక ఇన్నాళ్లు..
Benefits Of Home Lizards
Anand T
|

Updated on: Jan 15, 2026 | 11:10 AM

Share

ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉంటాయి. బల్లులు లేని ఇల్లే ఉండదు. అవి ఎప్పుడూ ఇంటి గోడలపై తిరుగుతూనే ఉంటాయి. చాలా మంది వీటిని చూసి భయపడతారు. వాటిని అశుభంగా భావిస్తారు. అందుకే ఈ బల్లులను ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ విషయాలు తెలిస్తే మీరు బల్లులను అస్సలు ఇంట్లోని నుంచి తరిమికొట్టరు. ఎందుకంటే బల్లులు ఇంట్లో ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవును, అవి మీ ఇంటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇంట్లో బల్లులు ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తెగులు నియంత్రణ: బల్లులు సహజంగానే ఇంటి గోడలపై ఉండే కిటకాలను తినడం ద్వారా తెగుళ్ళను నియంత్రిస్తాయి. ఈగలు, బొద్దింకలు, సాలెపురుగులు బల్లులకు ప్రధాన ఆహారం. ఇంటి చుట్టూ తిరిగే ఈ కీటకాలను తినడం ద్వారా బల్లలు మన ఇంటిని శుభ్రంగా ఉంచుతాయి. దీని వల్ల తెగుళ్లను నియంత్రించే పురుగుమందుల స్ప్రేలను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ స్ప్రేలు వాడడం వల్ల గాలి కాలుష్యంతో పాటు మొక్కలు,తేనెటీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలకు కూడా హానికరం కావచ్చు.

ఇది కూడా చదవండి: Gold, Silver Rates: అబ్బా సాయిరాం.. పండగ పూట భారీగా తగ్గిన బంగారం ధరలు, హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం: మీ ఇంట్లో బల్లులు ఉండటం మీ ఇంటి వాతావరణం సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉండే బల్లులు మీ ఇంటి గోడలపై ఎలాంటి కీటకాలను కనిపించకుండా చేస్తాయి. ఇంట్లోకి ప్రవేశించే కీటకాల సంఖ్యను తగ్గిస్తాయి. అవాంఛిత తెగుళ్ళ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. అంటే కాదు ఆ కీటకకాలను మీ ఆహారం వద్దకు రాకుండా నిరోదిస్తాయి.

ఇది కూడా చదవండి: Tea vs black Coffee: టీ కంటే బ్లాక్ కాఫీ ఎందుకు బెస్ట్..! ఈ సూపర్‌డ్రింక్‌తో కలిగే అద్బుత ప్రయోజనాలు ఇవే!

దోమల బెడద నుండి ఉపశమనం: ఇవే కాదు ఈ బల్లులు ఇంట్లోకి వచ్చిన దోమలను తరిమికొట్టడంలో సూపర్‌ యాక్టీవ్‌గా పనిచేస్తాయి. ఎందుకంటే బల్లులు అద్భుతమైన దోమల వేటగాళ్ళు. వ్యాధులు వ్యాప్తి చేసే దోమలను తినడం ద్వారా అవి మీ ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మీరు హానికరమైన దోమల నుంచి రక్షణ కలిగిస్తాయి. కాబట్టి ఇంట్లో బల్లులను తరిమికొట్టకుండా.. మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే.. అటు అవి.. ఇటు మీరు ఆరోగ్యంగా ఉంటారు.

ఇది కూడా చదవండి: Optical Illusion Challenge: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ అడవిలో దాగిఉన్న గొడుగును 7 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు!

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.