Beauty Tips: నుదుటిపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ సహజ చిట్కాలతో తగ్గించుకోండి..
Forehead pimples: పోషకాహార లోపానికి తోడు కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా అమ్మాయిల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి.
Forehead pimples: పోషకాహార లోపానికి తోడు కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా అమ్మాయిల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా నుదుటిపై కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చూడడానికి చిన్నవిగానే కనిపించినా ముఖారవిందంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ఈక్రమంలో చాలామంది నుదుటిపై మొటిమలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇందులో ఉపయోగించే కొన్ని రసాయనాల వల్ల కొన్ని దుష్ప్రభావాలు లేకపోలేదు. అందుకే వీటి నుంచి ఉపశమనం పొందడానికి సహజ పద్ధతులనే ఎంచుకోవాలంటారు సౌందర్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
దాల్చిన చెక్క
వంటకాలకు రుచిని పెంచే దాల్చిన చెక్కతో చర్మ సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిని తీసుకుని దానికి కొద్దిగా తేనె కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను నుదుటిపై ఉండే మొటిమల మీద అప్లై చేయండి. ఇలా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా చేస్తే కొద్ది రోజుల్లో మొటిమలు తగ్గిపోతాయి.
కలబంద
కలబందతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో పోషకాలున్న అలోవెరా జెల్‌ను చర్మంపై రాయడం వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఇందుకోసం ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు నుదుటిపై ఉండె మొటిమలపై మెత్తని అలోవెరా జెల్‌ను రాసుకోవాలి. కొంత సమయం తర్వాత పరిశుభ్రమైన నీటితో కడిగేసుకుంటే సరి.
గ్రీన్ టీ టోనర్
చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు టోనర్ అప్లై చేయడం ఉత్తమం. మీరు ఇంట్లో గ్రీన్ టీ నుంచి సహజసిద్ధంగా టోనర్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం గ్రీన్ టీ పొడిని తీసుకుని అందులో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో భద్రపరుచుకోవాలి. దీనిని క్రమం తప్పకుండావాడితే మంచి ఫలితముంటుంది.
పుదీనా, రోజ్ వాటర్
నుదుటిపై ఉండే మొటిమలను తొలగించడానికి మీరు చర్మ సంరక్షణలో పుదీనాను కూడా చేర్చవచ్చు. ఇందుకోసం 10 నుంచి 12 పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మొటిమల మీద రాసి కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయండి.
అలా చేయవద్దు
నుదిటిపై మొటిమలను స్క్రబ్ చేయడం లేదా రుద్దడం అసలు చేయవద్దు. ఇలా చేయడం వల్ల మొటిమలు మరింత ఎక్కువవుతాయి. పైన సూచించిన సహజ పద్ధతులను పాటించండి. మొటిమలను తగ్గించుకోండి.
Also Read:TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి
IND vs SL: రోహిత్ శర్మ ఖాతాలో చేరనున్న భారీ రికార్డు.. మరో 12 సిక్సులు కొడితే..!