IND vs SL: రోహిత్ శర్మ ఎదుట భారీ రికార్డు.. మరో 12 సిక్సులు కొడితే..!

భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 24న లక్నోలో జరగనుంది. ఈ సిరీస్‌లో రోహిత్ సరసన ఓ రికార్డు చేరే ఛాన్స్ ఉంది.

టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కివీస్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్(112 మ్యాచ్‌ల్లో 165 సిక్సర్లు) రికార్డు సృష్టించాడు.

రోహిత్ 122 మ్యాచుల్లో 154 సిక్సర్లు కొట్టి రెండో స్థానంలో నిలిచాడు.

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో 12 సిక్సర్లు బాదితే ఈ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 10 ప్లేయర్లలో భారత్ నుంచి రోహిత్ ఒక్కడే ఉన్నాడు.

వెస్టిండీస్‌ ప్లేయర్ క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు. గేల్ 79 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు కొట్టాడు.

ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ 120 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్ 120 సిక్సర్లు కొట్టి ఐదో స్థానంలో ఉన్నాడు.