AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grapes Benefits: రోజూ రాత్రి నిద్రకు ముందు గ్రేప్స్ జ్యూస్ తాగితే ఆ సమస్యలకు చెక్..లాభాలు తెలిస్తే…

తద్వారా రక్తనాళాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల గుండెకు సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది. రోజుకో గ్లాస్ గ్రేప్‌ జ్యూస్‌ తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేప్‌ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఎలాంటి క్యాన్సర్ కణుతులు ఏర్పడకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

Grapes Benefits: రోజూ రాత్రి నిద్రకు ముందు గ్రేప్స్ జ్యూస్ తాగితే ఆ సమస్యలకు చెక్..లాభాలు తెలిస్తే...
Grape Juice
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2025 | 8:44 PM

Share

ద్రాక్షపండ్లలో ఎ, సి, బి-6 వంటి విటమిన్లు పుష్కలంగా నిండి ఉంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల కారణంగా గ్రేప్స్‌ మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్‌ వ్యాధుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి. గ్రేప్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు వయసు పైబడిన కొద్దీ శరీరంపై ముడతలు రాకుండా నివారిస్తాయి.

ద్రాక్ష పండ్లలో పోషక విలువలు, విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. రోజు ఉదయం పరగడుపున గ్రేప్స్ తినాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లిఅయిన జంటలకు గ్రేప్స్ పళ్లను ఒక వరంగా చెప్తారు. గ్రేప్స్ లేదా జ్యూస్ లను రాత్రి పూట తీసుకుంటే ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ జ్యూస్ ప్రభావం వల్ల ఆందోళన, యాంగ్జైటీ వంటివి దూరమవుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ ఎఫెక్టివ్‌ జరుగుతుంది.

గ్రేప్స్‌ జ్యూస్‌ తీసుకోవటం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా రక్తనాళాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల గుండెకు సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది. రోజుకో గ్లాస్ గ్రేప్‌ జ్యూస్‌ తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేప్‌ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఎలాంటి క్యాన్సర్ కణుతులు ఏర్పడకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..