AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ 12 విటమిన్‌ ఎందుకు తీసుకోవాలంటే..

మీ శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి విటమిన్‌ బి 12 చాలా అవసరం.  మీ శరీరం ఎన్నో విధులను నిర్వహించడానికి అవసరమైన పోషకం. విటమిన్‌  బీ 12 లోపం భారతీయ జనాభాలో అధికంగా ఉందని ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎండోక్రినాలజీ అండ్‌ మెటబాలిజం సర్వేలో తేలింది. ఉత్తర భారత జనాభాలో 47శాతం మందిలో ఈ పోషకలోపం ఉందని పేర్కొంది. విటమిన్‌ బీ 12 మీ శరీర పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పోషకలోపం వివిధ ఆరోగ్య సమస్యలకు […]

బీ 12 విటమిన్‌ ఎందుకు తీసుకోవాలంటే..
Anil kumar poka
|

Updated on: Aug 13, 2019 | 7:15 PM

Share

మీ శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి విటమిన్‌ బి 12 చాలా అవసరం.  మీ శరీరం ఎన్నో విధులను నిర్వహించడానికి అవసరమైన పోషకం. విటమిన్‌  బీ 12 లోపం భారతీయ జనాభాలో అధికంగా ఉందని ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎండోక్రినాలజీ అండ్‌ మెటబాలిజం సర్వేలో తేలింది. ఉత్తర భారత జనాభాలో 47శాతం మందిలో ఈ పోషకలోపం ఉందని పేర్కొంది.

విటమిన్‌ బీ 12 మీ శరీర పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పోషకలోపం వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాళ్లు నొప్పులు, స్కిన్‌ డిసీజెస్‌, గుండె సంబంధిత సమస్యలు, చిరాకు, వికారం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలుంటాయి. ఇవి మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

శాఖాహారుల్లో బీ 12 పోషకలోపాన్ని ఎక్కువగా గుర్తించారు. ఇంకా 50 ఏళ్లకు పైబడిన వారు, రక్తహీనత, పలు శస్ర్తచికిత్సలు చేయించుకుననవారికి బాలింతలు, గర్భిణీ స్తీలలోనూ బీ 12లోపం వచ్చే ప్రమాదముంది.

బీ 12 పోషకం ఎర్ర మాంసం, ఫౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలు,మొక్కల పాలు, రొట్టె మరియు పోషక ఈస్ట్‌ వంటి వాటిలో ఉంటుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రకారం..6 నెలల వయసు వరకు పిల్లలు ప్రతిరోజూ 0.4 మైక్రోగ్రామ్‌ విటమిన్‌ బీ 12 పొందాలి. 7 నుంచి 12 నెలల మధ్య వయసు వారు 0.5 ఎంసీజీ..1నుంచి 3 ఏళ్ల వయసు పిల్లలు 0.9..4 నుంచి 8ఏళ్ల వయసు వరకు 1.2ఎంసీజీ తీసుకోవాలి. 9నుంచి 13 ఏళ్ల వయసున్నవారు 1.8 ఎంసీజీ ..గర్భిణీ లేదా బాలింత స్త్రీలు 2.8 ఎంసీజీ వరకు తీసుకోవాలి.

విటమిన్ బీ 12లోపం క్రమంగా పెరుగుతుంది.  కంటి చూపు, జ్నాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. లోపం తీవ్రతరమైతే ఎర్రరక్త కణాల సంఖ్య కూడా పడిపోతుంది. ఇది మీ శరీరంలో ఆక్సిజన్‌ లోపం అలసట మరియు దడకు దారితీస్తుంది. కొవ్వు పదార్థం పెరిగి నరాల బలహినత ఏర్పడుతుంది. మీ శరీరం విటమిన్‌ బీ 12ను సొంతంగా ఉత్పత్తి చేయదు. అందుకే బయటినుంచి తీసుకోవాలి. మీ శరీరం ఈ విటమిన్‌ను నిల్వ చేయలేదు కనుక రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బీ 12 ఉపయోగపడుతుంది. ఇది అలసట, రక్తహీనత రాకుండా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఒమేగా 3తో పాటు విటమిన్‌ బీ 12 తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బులను నివారిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరచడంలో బీ 12 కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ బీ 12 సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కణాల DNAకు బీ 12 చాలా ముఖ్యమైనది. 30శాతం క్యాన్సర్‌ను నివారించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్‌ బీ చాలా ప్రసిద్ధి చెందింది. హెపటైటిస్‌ సీ ఇన్ఫెక్షన్‌ ఉన్న రోగులకు విటమిన్‌ బీ 12 చాలా ఉపయోగకరం. అల్జీమర్స్‌ వ్యాధిని నివారించవచ్చు. డిప్రెషన్‌, మానసిక సమస్యలతో బాధపడేవారికి బీ 12 సహాయపడుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది.