Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వస్తువులు అప్పుగా అయినా సరే.. ఉచితంగా అయినా సరే అస్సలు తీసుకోకూడదు..! ఎందుకో తెలుసా..?

వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఉచితంగా లేదా అప్పుగా తీసుకుంటే ఇంట్లో నెగెటివ్ శక్తి నిండిపోతుంది. ఇది మనకు తెలియకుండానే డబ్బు సమస్యలు, అనారోగ్యం, కుటుంబ కలహాలు వంటివి తెస్తుందని నమ్మకం. ఈ ఆచారాలు చాలా కాలం నుంచి ఉన్నా వాటి వెనుక ఉన్న అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఈ వస్తువులు అప్పుగా అయినా సరే.. ఉచితంగా అయినా సరే అస్సలు తీసుకోకూడదు..! ఎందుకో తెలుసా..?
Vastu For Positivity
Follow us
Prashanthi V

|

Updated on: Jun 11, 2025 | 11:08 PM

శాస్త్రం ప్రకారం ఉప్పు శని గ్రహానికి గుర్తు. దాన్ని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకుంటే శని దోషం వస్తుందని నమ్ముతారు. ఇది ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఉప్పును ఎప్పుడూ ఉచితంగా తీసుకోకుండా కొనుగోలు చేయాలి. ఇతరులకూ ఉచితంగా ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.

కొంతమంది బంధువులు, స్నేహితులు డబ్బుల పర్సును బహుమతిగా ఇస్తారు. కానీ వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇతరులు ఇచ్చిన పర్సును వాడటం వల్ల డబ్బు విషయంలో ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు ఇచ్చిన పర్సులను వాడటం వల్ల ఆదాయంలో స్థిరత్వం ఉండకపోవచ్చు.

ఇతరులు ఉపయోగించిన హ్యాండ్‌ కర్చీఫ్ లు తిరిగి తీసుకోవడం మంచిది కాదు. వాస్తు నియమాల ప్రకారం ఇవి మన ఇంటికి, మనశ్శాంతికి చెడు చేస్తాయి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఎవరైనా వాడిన గడియారాన్ని తీసుకుని వాడటం వల్ల వారి కాలచక్రం కూడా మనపై ప్రభావం చూపుతుందని నమ్మకం. ముఖ్యంగా ఆ గడియారం వాడినవారు గతంలో ఇబ్బందుల్లో ఉంటే.. వాటి చెడు ప్రభావం మనకూ వస్తుందని వాస్తు చెబుతోంది. అందుకే ఉపయోగించిన గడియారాలను తీసుకోవడం మానుకోవాలి.

ఇంట్లో వాడే అగ్గిపెట్టెలు, లైటర్లు వంటి వాటిని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవడం వల్ల కుటుంబంలోని శాంతి దెబ్బతినే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం దీని వల్ల మన ఇంట్లో గొడవలు, వాదనలు, భావోద్వేగ సమస్యలు పెరుగుతాయని చెబుతారు. ఇది రాహు గ్రహ దోషాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నమ్మకం ఉంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)