AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు ఏ వయస్సులో ఒంటరిగా నిద్రపోవాలి…! ఒంటరిగా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..?

పిల్లలు తల్లిదండ్రులతో కలిసి నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఇది సహజం. అయితే పిల్లలు ఎదిగే కొద్దీ ఒంటరిగా నిద్రపోవడం కూడా నేర్చుకోవాలి. దీని వల్ల వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒంటరిగా నిద్రపోవడం వల్ల పిల్లల్లో అనేక మార్పులు వస్తాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలు ఏ వయస్సులో ఒంటరిగా నిద్రపోవాలి...!  ఒంటరిగా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..?
Parenting Tips
Prashanthi V
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 16, 2025 | 8:56 AM

Share

పిల్లలు ఒంటరిగా నిద్రపోవడం వల్ల స్వతంత్రంగా ఉండటం నేర్చుకుంటారు. తమ పనులు తాము చేసుకోవడం అలవాటు అవుతుంది. ఒంటరిగా నిద్రపోవడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమనే ధైర్యం వస్తుంది. పిల్లలు ఒంటరిగా నిద్రపోవడం వల్ల తల్లిదండ్రులపై ఆధారపడటం తగ్గుతుంది. ఇది వారికి చాలా మంచిది. పైగా పిల్లలు ఒంటరిగా నిద్రపోతే బాగా నిద్రపోతారు. నిద్రలేమి సమస్య ఉండదు. పిల్లలను వెంటనే ఒంటరిగా నిద్రపోమని చెప్పకూడదు. వారికి కొంత సమయం ఇవ్వాలి. వారిని ప్రోత్సహించాలి.

పిల్లలను ఎలా ప్రోత్సహించాలి..?

  • మెల్లగా అలవాటు చేయాలి.. మొదట వారానికి రెండు మూడు సార్లు ఒంటరిగా నిద్రపోవడానికి ప్రయత్నించమనాలి. తర్వాత క్రమంగా రోజుల సంఖ్యను పెంచాలి.
  • కథలు చెప్పాలి.. పడుకునే ముందు వారికి మంచి కథలు చెప్పాలి. దీనివల్ల వారికి నిద్ర వస్తుంది.
  • భయం పోగొట్టాలి.. చీకటి భయం ఉంటే లైట్ వెయ్యొచ్చు. వారికి ఇష్టమైన బొమ్మలు, దుప్పట్లు ఇవ్వచ్చు.
  • ప్రోత్సాహించాలి.. పిల్లలను ఒంటరిగా నిద్రపోవడానికి ప్రోత్సహించాలి. వారికి బహుమతులు ఇవ్వచ్చు.

ఏ వయస్సులో ఒంటరిగా నిద్రపోవాలి..?

పిల్లలు 8 సంవత్సరాల వయస్సు నుండే ఒంటరిగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఈ వయస్సులో వారు పెద్దవాళ్ళుగా మారుతారు. దేన్నైనా ఎదుర్కోగలరు అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్కో బిడ్డ ఒక్కోలా ఉంటారు. కొంత మంది పిల్లలు తొందరగా అలవాటు పడతారు. మరికొంత మందికి సమయం పడుతుంది.

పిల్లలు ఒంటరిగా నిద్రపోవడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇది వారికి చాలా ముఖ్యం. దీనివల్ల వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. పిల్లలకు సహాయం చేయాలి. పిల్లలు ఒంటరిగా నిద్రపోవడం వల్ల వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.