AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: ఈ బ్లడ్ గ్రూప్స్ వారికి అలెర్ట్.. డయాబెటిస్ రిస్క్ వీరిలోనే ఎక్కువ..

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి ఎంతో మందిని పట్టిపీడిస్తోంది. ఒక్క సారి ఈ వ్యాధి బారిన పడితే దాని కారణంగా సఫర్ అవ్వడమే కానీ పూర్తి స్థాయిలో నివారణ అనేదే లేని పరిస్థితి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఇలా ప్రతీదీ డయాబెటిస్ లక్షణాలను పెంచి పోషిస్తున్నాయి. మన దేశంలో 70 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు.

Health News: ఈ బ్లడ్ గ్రూప్స్ వారికి అలెర్ట్.. డయాబెటిస్ రిస్క్ వీరిలోనే ఎక్కువ..
Diabetis Risk
Bhavani
|

Updated on: Feb 15, 2025 | 7:45 PM

Share

భారత్ ఇప్పుడు ప్రపంచానికి ‘డయాబెటిస్ రాజధాని’ గా మారిపోయింది. మధుమేహం అనేది జీవన శైలి వ్యాధి అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇప్పటికే నిర్ధారించింది. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం డయాబెటిస్ ముప్పును వ్యక్తుల బ్లడ్ గ్రూప్ ఆధారంగా కూడా గుర్తించవచ్చట. ఒక్క జీవన శైలి మాత్రమే కాకుండా జన్యు పరంగా ఎన్నో అంశాలు ఈ వ్యాధికి కారణమవుతాయట. అందులో ఒకటి మన బ్లడ్ గ్రూప్ కూడా అని పరిశోధకులు చెప్తున్నారు. వారు చెప్పిన గణాంకాల ప్రకారం ఏ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ ప్రమాదం ఎంత శాతం మేర ఉందనే విషయాలు తెలుసుకుందాం.

యురోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ కు చెందిన డయాబెటాలోజియా అనే జర్నల్లో దీనిపైన నిర్వహించిన సర్వేలో కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారికే డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడించారు. బ్లడ్ గ్రూప్ కు టైప్ టు డయాబెటిస్ కు మధ్య ఉన్న సంబంధంపై పరిశోధనలు జరిపారు. మొత్తం 80వేల మంది మహిళలను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వారు వెల్లడించారు.

వీరికే రిస్క్ ఎక్కువ..

బ్లడ్ గ్రూపులలో ఏ, బి, ఏబి బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువని గుర్తించారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్ కాకుండా ఇతర గ్రూపుల వారికి అసలు షుగర్ వ్యాధి రాదనుకుంటే పొరపాటే. ఇతర బ్లడ్ గ్రూపుల వారికి కూడా వారి వారి జన్యుపరమైన అంశాలు, ఆహారం, జీవన శైలి అలవాట్ల పరంగా షుగర్ వ్యాధి రిస్క్ కచ్చితంగా ఉంటుందని వారుచెప్తున్నారు. ముఖ్యంగా బి బ్లడ్ గ్రూపు ఉన్నవారు డయాబెటిస్ రాకుండా మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని వారు సూచించారు.

మహిళలు జాగ్రత్త..

పరిశోధకులు చెప్తున్న వివరాల ప్రకారం మహిళల్లో ఈ వ్యాధి ముప్పు 21 శాతం అధికంగా ఉంటుందని వారు తెలిపారు. అదేవిధంగా ఓ బ్లడ్ గ్రూపుతో కంపేర్ చేస్తే ఏ బ్లడ్ గ్రూపు వారికైనా డయాబెటిస్ వచ్చే చాన్స్ 10 శాతం మేర ఉంటుదని వారు తెలిపారు. ఓ బ్లడ్ గ్రూపు వారితో పోలిస్తే బి పాజిటివ్ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నారు.

అదే అసలు కారణం..

బ్లడ్ గ్రూపుకు డయాబెటిస్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది ఇప్పటివరకు తేల్చలేకపోయారు. నాన్ విల్లే బ్రాండ్ ఫ్యాక్టర్ అనే ప్రొటీన్ నాన్ ఓ బ్లడ్ గ్రూపువారిలో ఎక్కువగా ఉంటుందన్నారు. రక్తంలో చక్కర స్థాయిల హెచ్చుతగ్గులకు ఇదే కారణమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..