Blood Pressure: మీ రక్తపోటు సరిగ్గానే చెక్ చేసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే రీడింగ్ ఎక్కువ వస్తుందట..
రక్తపోటు తరచూ ఇంట్లోనో లేక ఆస్పత్రికి వెళ్లో చెక్ చేసుకోవడం నేటి కాలంలో సాధారణం అయిపోయింది. ముఖ్యంగా బీపీ చెకింగ్‌కి చాలా మంది ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రక్తపోటును తనిఖీ చేయడంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల తప్పుడు రీడింగ్ వస్తుంది..

నేటి జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే బీపీ, డయాబెటిస్ పలకిరిస్తున్నాయి. దీంతో తరచూ వీటిని ఇంట్లోనో లేక ఆస్పత్రికి వెళ్లో చెక్ చేసుకోవడం పరిపాటై పోయింది. ముఖ్యంగా బీపీ చెకింగ్‌కి చాలా మంది ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రక్తపోటును తనిఖీ చేయడంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల తప్పుడు రీడింగ్ వస్తుంది. జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ విశాఖ ఖచ్చితమైన రీడింగ్ పొందడానికి అనుసరించే పద్ధతి గురించి చెబుతున్నారు. సాధారణంగా రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు తెలిసో.. తెలియకో.. చేసే తప్పులు రీడింగ్‌ను ఎలా పెంచుతాయో లేదా తగ్గిస్తాయో ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు..
రక్తపోటు తనిఖీ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
ఒత్తిడి తర్వాత వెంటనే రక్తపోటును తనిఖీ చేయడం
శారీరక శ్రమ లేదా భావోద్వేగ ఒత్తిడి తర్వాత వెంటనే రక్తపోటును కొలవడం సాధారణంగా అందరూ చేసే తప్పు. ఇది సిస్టోలిక్ రక్తపోటును తప్పుగా పెంచుతుంది. ఇటువంటి రీడింగ్‌లు వ్యక్తి వాస్తవ బేస్‌లైన్ స్థాయిలను వెల్లడించదు. బీపీ చెకప్ చేసుకునే ముందు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం మంచిది.
కూర్చునే భంగిమ కూడా రీడింగ్‌లను పెంచుతుంది
చెకప్ సమయంలో కూర్చునే తప్పుడు భంగిమ కూడా రీడింగ్‌ను ప్రభావితం చేస్తుంది. కాళ్ళు అడ్డంగా పెట్టుకుని, వేలాడిస్తూ.. తగినంత వీపు మద్దతు లేకుండా కూర్చున్నప్పుడు రక్తపోటు రీడింగ్‌లు 10 mmHg నుంచి 15 mmHg వరకు పెరుగుతాయి. రీడింగ్ సమయంలో వీపు భాగం కుదురుగా ఉంచాలి. రెండు పాదాలు నేలపై ఉంచాలనే విషయాలు నిర్ధారించుకోవాలి. ఇలా చేస్తే చెకప్ సక్రమంగా ఉంటుంది.
చేయి స్థానం చాలా కీలకం
చేయి వేలాడదీయడం లేదా సపోర్ట్ లేకుండా ఉండటం మరొక సాధారణ తప్పు. చేయి గుండె స్థాయి కంటే తక్కువగా ఉంచినట్లయితే తప్పుగా అధిక రక్తపోటు రీడింగ్ వస్తుంది. అదేవిధంగా చేయి చాలా ఎత్తుగా పైకి లేపినా తప్పుగా తక్కువ రీడింగ్ వస్తుంది. చేయి గుండె స్థాయిలో సౌకర్యవంతంగా ఉండేలా ఉంచాలి. ఇది రక్తపోటును కొలవడానికి సరైన భంగిమ.
View this post on Instagram
తప్పు కఫ్ సైజును ఉపయోగించడం
కఫ్ సైజు అనేది రక్తపోటు రీడింగ్‌లను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం. చాలా చిన్నగా ఉన్న కఫ్ తప్పుగా రీడింగ్‌లను పెంచుతుంది. అలాగే పెద్దగా ఉన్న కఫ్ కూడా తప్పుగా తక్కువ రీడింగ్‌కు దారితీస్తుంది. ఖచ్చితమైన కొలత కావాలంటే చేయి చుట్టుకొలతకు తగిన కఫ్‌ను మాత్రమే ఉపయోగించాలి.
ఒకే పఠనంపై ఆధారపడటం
ఒకే రక్తపోటు రీడింగ్ ఆధారంగా రోగ నిర్ధారణ లేదా చికిత్స చేయడం తగినది కాదు. రోజంతా రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. కేవలం ఒకే రీడింగ్‌పై ఆధారపడటం తప్పుడు చికిత్సకు దారితీయవచ్చు. చికిత్సకు ముందు కనీసం రెండు రీడింగ్‌లను తీసుకోవాలి. ఒకటి పడుకున్నప్పుడు, మరొకటి కూర్చున్నప్పుడు తీసుకోవాలి
ఈ మేరకు డాక్టర్ విశాఖ ఇన్‌స్టా పోస్టులో భంగిమ, సమయం, సాంకేతికతలో చిన్న సర్దుబాట్లు రక్తపోటు రీడింగ్ ఖచ్చితంగా రావడానికి ఉపయోగపడుతుందని సూచించారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




