Get Rid of Sinus: సైనస్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!
శీతా కాలంలో చాలా మంది ఇబ్బంది పడే వాటిల్లో ఈ సైనస్ కూడా ఒకటి. చలి కాలంలో ఈ బాధ మరింత ఎక్కువ అవుతుంది. చలి పెరిగినా సైనస్ ఇన్ ఫెక్షన్ సోకి ఇబ్బందులు పెడుతుంది. సైనస్ ఉన్నవారికి తరచుగా ముక్కు బిగిసి పోవడం, విపరీతమైన తల నొప్పి. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కను బొమ్ములు కూడా జివ్వుమని లాగుతున్నట్టు అనిపిస్తుంది. వింటర్ సీజన్‌లో సైనస్ ఇన్ ఫెక్షన్ రావడం సర్వ సాధారణమైన విషయం. అయితే ఈ సైనస్‌కి కేవలం మందులతోనే కాదు..

శీతా కాలంలో చాలా మంది ఇబ్బంది పడే వాటిల్లో ఈ సైనస్ కూడా ఒకటి. చలి కాలంలో ఈ బాధ మరింత ఎక్కువ అవుతుంది. చలి పెరిగినా సైనస్ ఇన్ ఫెక్షన్ సోకి ఇబ్బందులు పెడుతుంది. సైనస్ ఉన్నవారికి తరచుగా ముక్కు బిగిసి పోవడం, విపరీతమైన తల నొప్పి. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కను బొమ్ములు కూడా జివ్వుమని లాగుతున్నట్టు అనిపిస్తుంది. వింటర్ సీజన్‌లో సైనస్ ఇన్ ఫెక్షన్ రావడం సర్వ సాధారణమైన విషయం. అయితే ఈ సైనస్‌కి కేవలం మందులతోనే కాదు.. మీరు తినే ఆహారంతో కూడా చెక్ పెట్టొచ్చు. సైనస్‌తో ఇబ్బంది పడేవారు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.
వేడిగా ఉండే పానీయాలు..
సైనస్‌తో ఇబ్బంది పడే వారు వేడిగా ఉండే పానీయాలు తీసుకోవడం వల్ల ఉపశమనంగా అనిపిస్తుంది. సైనస్ నొప్పి వేధిస్తుంటే.. వేడి వేడి సూప్స్, టీ, కాఫీలు, ఇతర పానీయాలు తీసుకోవడం ఉత్తమం. ఇవి నాసికా రద్దీ, శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనం ఇస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం చికెన్ సూప్ తీసుకుంటే సైనస్ నుంచి రిలీఫ్ పొందడమే కాకుండా.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అల్లం టీ కూడా బెటర్‌గా పని చేస్తుంది.
సిట్రస్ పండ్లు..
సైనస్ ఉన్నవారు చాలా మంది సిట్రస్ పండ్లకు దూరంగా ఉంటారు. ఎందుకంటే వీటిని తింటే సైనస్ మరింత ఎక్కువ అవుతుంది అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. సిట్రస్ పండ్లు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అంతే కాకుండా వివిధ రకాల ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. సైనస్‌తో ఉన్నవారు బత్తాయి, కమల, ద్రాక్ష, కివీ, నిమ్మ వంటి పండ్లు చేర్చోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అల్లం – వెల్లుల్లి..
అల్లం, వెల్లుల్లిలో అనే రకాల పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సైనస్ ఇన్ ఫెక్షన్‌కు చికిత్స చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా నొప్పిని కూడా తగ్గిస్తాయి. తేనె కూడా సైనస్ ఇన్ ఫెక్షన్ తగ్గించేందుకు బెటర్‌గా పని చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








