Eyesight Tips: కంటి సమస్యలు వేధిస్తున్నాయా? ఆహారంలో వీటిని చేర్చుకుంటే చాలా సమస్యలన్నీ ఫసక్..
ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్ వంటివి ఎక్కువ వినియోగిస్తున్నారు. దీంతో స్క్రీన్ సమయం ఎక్కువ అవ్వడం వల్ల వాటి నుంచి వచ్చే కిరణాలు కంటి పనితీరును దెబ్బతీస్తున్నాయి.
సాధారణంగా మనిషి శరీరంలో ప్రతి అవయువం ముఖ్యమైనదే. అయితే అవి నిర్వహించే పనులను బట్టి వాటి ప్రాముఖ్యత మారుతూ ఉంటుంది. మానవ శరీరంలో కళ్లకు ఉన్న ప్రాముఖ్యత వేరు. మనం ప్రపంచాన్ని చూడాలంటే కచ్చితంగా మన కళ్లు ఆరోగ్యంగా ఉండాలి. కళ్లతో చూసినవి ఎక్కువసేపు గుర్తు ఉంటాయి. అయితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్ వంటివి ఎక్కువ వినియోగిస్తున్నారు. దీంతో స్క్రీన్ సమయం ఎక్కువ అవ్వడం వల్ల వాటి నుంచి వచ్చే కిరణాలు కంటి పనితీరును దెబ్బతీస్తున్నాయి. అలాగే మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాహారం కూడా అందడం లేదు. దీంతో వయస్సుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. అయితే కంటి ఆరోగ్యం కోసం అందరూ చెప్పే ఏకైక టిప్ క్యారెట్ వినియోగం. అధికంగా క్యారెట్ తింటే కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. క్యారెట్ కంటి ఆరోగ్యానికి మంచిదే అయితే క్యారెట్ కంటే ఇతర ఆహార పదార్థాలను కూడా రోజు వారి ఆహారంలో తింటే కంటి సమస్యలు దూరమవుతాయి. నిపుణులు సూచించే ఆ ఆహార పదార్థాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఆకుకూరలు
మన రోజువారీ ఆహారంలో ఆకుకూరలకు చేర్చుకుంటే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఆకుపచ్చని ఆకు కూరల్లో ఐరన్‌తో పాటు కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బచ్చలికూర, కాలే, బ్రోకలీ మన కంటి చూపును మెరుగుపరుస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎర్ర మిరియాలు
రెడ్ బెల్ పెప్పర్స్‌లో అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇవి కంటి రక్త నాళాలకు ఆరోగ్యాన్ని మెరుగపర్చడంలో సాయం చేస్తాయి. వీటిని అధికంగా తీసుకుంటే కంటిశుక్లం అభివృద్ధి చెందడాన్ని నిరోధిస్తుంది. అలాగే బొప్పాయిలు, బెర్రీల్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి రోజువారీ ఆహారంలో వాటిని చేర్చుకుంటే మంచిది.
డ్రై ఫ్రూట్స్
బాదం పప్పు, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు గింజలు వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్లు ఈ,సీ,జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లకు ఆక్సీకరణ నష్టం జరగకుండా కాపాడతాయి.
చిక్కుడు గింజలు
చిక్కుడు గింజలు, కాయధాన్యాల్లో జింక్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సహజంగా ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రత్యామ్నాయాలలో ఒకటిగా నిలుస్తాయి.
గుడ్లు
గుడ్లల్లో ఉండే హై-ప్రోటీన్ కంటి దృష్టికి బాగా సహాయం చేస్తుంది. ముఖ్యంగా గుడ్డులో ఉండే పచ్చసొనలోని సమ్మేళనాలు కంటిలోని రెటీనాను దెబ్బతీయకుండా హానికరమైన నీలి కాంతిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
చిలకడదుంపలు
చిలకడ దుంపల్లో విటమిన్-ఈతో పాటు కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది కళ్లకు ఆక్సీకరణ నష్టాన్ని రక్షిస్తుంది. చీకట్లో కూడా కళ్లు చురుగ్గా పని చేయడానికి సాయం చేస్తాయి.
కిడ్నీ బీన్స్
కిడ్నీ బీన్స్‌లో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ బీన్స్ రాత్రి సమయంలో దృష్టికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే వీటిని అధికంగా తీసుకుంటే కంటిశుక్లం అభివృద్ధి చెందదని ధ్రువీకరిస్తున్నారు.
కివి
కంటి ఆరోగ్యానికి మేలు చేసే అనేక పండ్లలో కివి ఒకటి. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించడానికి కివి సహాయపడుతుంది. అలాగే కళ్లపై అధిక ఒత్తిడి ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి