Eye Care: కంటిపై ‘స్మార్ట్ ఫోన్‘ కాటు.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ కళ్లు సేఫ్.. ఇప్పుడే సెట్టింగ్స్ మార్చుకోండి..

బ్లింక్, బ్లింక్, బ్లింక్.. క్రమం తప్పకుండా రెప్పవేయడం చేస్తుండాలి. ఇది మీ కళ్లను తేమగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Eye Care: కంటిపై ‘స్మార్ట్ ఫోన్‘ కాటు.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ కళ్లు సేఫ్.. ఇప్పుడే సెట్టింగ్స్ మార్చుకోండి..
Smartphone In Dark
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Feb 15, 2023 | 4:25 PM

మీరు రాత్రి సమయంలో అధికంగా ఫోన్ వినియోగిస్తున్నారా? అయితే మీ కళ్లు ప్రమాదంలో పడినట్లే! ఇటీవల హైదారాబాద్ కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ తన వద్దకు వచ్చిన ఓ మహిళా పేషెంట్ గురించి వరుస ట్వీట్లలో వివరించారు. తను రాత్రి సమయంలో ఫోన్ వినియోగించడం వల్ల తన చూపును ఏ విధంగా కోల్పోయింది. తిరిగి ఎలా తన చూపును పొందుకోగలిగిందో వివరించారు. అయితే అసలు అంత వరకూ సమస్య వెళ్లకూడదంటే కొన్నిచిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్ వినియోగించాల్సిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవిగో..

డార్క్ మోడ్‌ని ఉపయోగించండి.. మీ స్మార్ట్ ఫోన్ లో డార్క్ మోడ్ లేదా డార్క్ థీమ్ అనే సెట్టింగ్ ఉంటుంది. దానిని ఏనేబుల్ చేసుకోవాలి. ఇది బ్లూ లైట్ ఎక్స్ పోజర్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఫోన్ డిస్‌ప్లే బ్రైట్ నెస్ కూడా తగ్గి, సాధారణంగా స్క్రీన్ టైమ్‌తో వచ్చే డిజిటల్ ఐ స్ట్రెయిన్‌ను అదుపు చేస్తుంది.

స్క్రీన్ బ్రైట్‌నెస్.. మీ సెల్ ఫోన్ బ్రైట్‌నెస్ వీలైనంత తక్కువ పెట్టుకోవాలి. కాంట్రాస్ట్ కూడా సరిపడినంత ఉంచుకోవాలి. మీ సెల్ ఫోన్ సెట్టింగ్స్ లో వీటిని సర్దుబాటు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

రెప్పలు వేస్తూ ఉండాలి.. బ్లింక్, బ్లింక్, బ్లింక్.. క్రమం తప్పకుండా రెప్పవేయడం ద్వారా (సెకను కంటే ఎక్కువ సమయం) మీ కళ్లను తేమగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రతి అరగంటకు 10 నుంచి 20 సార్లు బ్లింక్ చేయాలి. రెప్పవేయడం ద్వారా మీ కంటి ఆరోగ్య బావుంటుంది.

ఈ సెట్టింగ్స్ ని ఏనేబుల్ చేయాలి.. ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో సహాయపడే సెట్టింగ్‌లు ఉంటాయి. ఐఫోన్లలో స్క్రీన్ టైమ్‌తో, వినియోగదారులు వారి యాప్ వినియోగాన్ని నిర్వహించవచ్చు, పరికరం నుండి దూరంగా ఉండేందుకు సమయాన్ని షెడ్యూల్ చేయవచ్చు. అలాగే యాప్‌లు/నోటిఫికేషన్‌లను బ్లాక్ చేయవచ్చు. అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో, దాదాపు అన్ని సారూప్య ఫీచర్లను అందించే డిజిటల్ వెల్‌బీయింగ్ ఫీచర్ ఉంది. యాప్ లిమిట్ టైమర్‌లు, వినియోగదారులు నిద్రపై దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడటానికి “విండ్ డౌన్” లేదా “బెడ్‌టైమ్” మోడ్ వంటి వాటిని ఏనేబుల్ చేయాలి. వినియోగదారులు రెండు పరికరాలలో ఎప్పుడైనా ఈ సెట్టింగ్‌లలో దేనినైనా మార్చవచ్చు లేదా ఆఫ్ చేయవచ్చు.

ఐఫోన్‌లలో నైట్ షిఫ్ట్.. ఆండ్రాయిడ్లో నైట్ లైట్.. ఐఫోన్‌లలో నైట్ షిఫ్ట్, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో నైట్ లైట్ ఫీచర్ మీ కంటిపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. డిస్ ప్లే లోని రంగుల ఎఫెక్ట్ కంటిపై పడకుండా ఇవి కాపాడుతాయి.

టెక్స్ట్ పరిమాణాన్ని పెంచండి.. మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై టెక్ట్స్ సైజ్ పెద్దదిగా ఉండేటట్లు చూపుకోండి. చిన్న టెక్ట్స్ కారణంగా కళ్లపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. మీరు సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా టెక్స్ట్ పరిమాణాన్ని సులభంగా మార్చవచ్చు. అన్ని స్మార్ట్‌ఫోన్‌లు కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్, టెక్స్ట్ సెట్టింగ్‌లను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

స్క్రీన్‌ను శుభ్రంగా ఉంచండి.. మన స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ తరచూ మురికిగా మారిపోతుంది. మనం వాటిని ఉపయోగించినప్పుడు మన చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండవు, అలాగే మనం వాటిని ఉంచే ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉండవు. మురికిగా ఉన్న స్క్రీన్ మన కళ్ళపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి మన ఫోన్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మృదువైన గుడ్డను తీసుకొని మీ స్క్రీన్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి, దీని కోసం మీకు నీరు లేదా డిటర్జెంట్ అవసరం లేదు.

20/20/20 నియమాన్ని అనుసరించండి.. స్మార్ట్‌ఫోన్‌ల కోసం 20/20/20 అని పిలవబడే నియమం ఉంది. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. ఇది మీ కళ్ళను రక్షించుకోవడంలో బాగా ఉపకరిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు