AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp new feature: మీరు పంపిన మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోవాలా? వాట్సాప్ ‘వ్యూ వన్స్’ ఫీచర్ ఉంది.. ఇలా సెట్ చేసుకోండి..

వాట్సాప్ తాజాగా వ్యూ వన్స్ అనే ఇంట్రెస్టింగ్​ ఫీచర్​ను ప్రవేశపెట్టింది. మీరు పంపిన మెసేజ్ లు, ఫోటోలు లేదా వీడియోలను అవతలి వ్యక్తి ఒకసారి మాత్రమే చూసేలా ఫీచర్ పనిచేస్తుంది.

WhatsApp new feature: మీరు పంపిన మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోవాలా? వాట్సాప్ ‘వ్యూ వన్స్’ ఫీచర్ ఉంది.. ఇలా సెట్ చేసుకోండి..
Whatsapp
Madhu
|

Updated on: Feb 15, 2023 | 2:00 PM

Share

గత కొన్నేళ్లుగా సోషల్ మెసేజింగ్ యాప్స్ లో డిజప్పీయరింగ్ మెసేజెస్ అనే ఫీచర్ ఓ ట్రెండ్ గా మారింది. మొదటిగా స్నాప్ చాట్ దీనిని ప్రవేశపెట్టింది. మీరు పంపిన మెసేజ్ లు, వీడియోలు, ఫోటోలు అవతలి వ్యక్తి చూడగానే వెంటనే డిలీట్ అయిపోయే విధంగా ఆ ఫీచర్ ఉంటుంది. ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సోషల్ మెసేజింగ్ యాప్ కూడా ఈ ఫీచర్ ని తీసుకొస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో దీనిని వానిష్ మోడ్ అని, వాట్సాప్ లో వ్యూ వన్స్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ లో ఈ వ్యూ వన్స్ అనే ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

ఏనేబుల్ చేసుకోవాలి..

వాట్సాప్ తాజాగా వ్యూ వన్స్ అనే ఇంట్రెస్టింగ్​ ఫీచర్​ను ప్రవేశపెట్టింది. మీరు పంపిన మెసేజ్ లు, ఫోటోలు లేదా వీడియోలను అవతలి వ్యక్తి ఒకసారి మాత్రమే చూసేలా ఫీచర్ పనిచేస్తుంది. అంటే మీరు పంపిన ఫోటోలు లేదా వీడియోలు సింగిల్​ వ్యూతో వెంటనే డిలీట్ అయిపోతాయి. అంతేకాదు, అవి అవతలి వ్యక్తి గ్యాలరీలో కూడా సేవ్​ అవ్వవు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ, వాట్సాప్ వ్యూ వన్స్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీరు షేర్​ చేసిన మెసేజ్​ చాట్ బాక్సులో ఎప్పటికీ కనిపించకుండా ఉండాలంటే ఈ ఫీచర్​ను ఎనేబుల్​​ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ ఫీచర్​ను ఎనేబుల్​ చేసిన తర్వాత ఫార్వర్డ్​, సేవ్​, స్టార్​, షేర్ (Share)​ చేయడం కుదరదు. ఒకవేళ మీరు పంపిన ఫోటో లేదా వీడియోను అవతలి వ్యక్తి 14 రోజుల్లోపు ఓపెన్​ చేయకుండా ఉంటే దానంతట అదే డిలీట్​ అయిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇలా సెట్ చేసుకోవాలి..

  • మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో వాట్సాప్ లేటెస్ట్​ వెర్షన్​ను అప్​డేట్ చేసుకోండి.
  • మీరు పంపాల్సిన ఫోటో లేదా వీడియోను ఎంచుకోండి.
  • మీ కాంటాక్టుల్లో ఎవరికి ఒకసారి మాత్రమే మెసేజ్​ కనిపించాలో ఎంచుకోండి.
  • తర్వాత, క్యాప్షన్ బార్ పక్కన ఉన్న ‘వ్యూ వన్స్​’ సింబల్​పై క్లిక్​ చేయండి.
  • మీకు ఒక అలర్ట్ మెసేజ్​ డిస్​ప్లే అవుతుంది. వ్యూ వన్​ ఫీచర్​ను యాక్టివేట్​ చేయాలా? అని ప్రాంప్ట్​ మెసేజ్​ కనిపిస్తుంది.
  • అప్పుడు మెసేజ్ సెండింగ్ ఐకాన్‌కు ముందు కనిపించే 1 బటన్​ నొక్కితే చాలు.. మీరు ఎంచుకున్న కాంటాక్టులకు ఫొటో లేదా వీడియో సెండ్ అవుతుంది.
  • యూజర్​ ప్రైవసీని మెరుగుపర్చడానికి ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చినట్లు వాట్సాప్​ పేర్కొంది. ఫోటోలు, వీడియోలకు ప్రైవసీ ఉండాలనుకునే వారికి ఈ ఫీచర్​ ఉపయోగపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!