Red Rice Benefits: రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

బియ్యాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ అందరూ ఎక్కువగా వైట్ రైసే తింటారు. ఇండియాలోని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా వైట్ రైస్ తింటారు. బరువు తగ్గాలి అనుకునేవారు, డయాబెటీస్, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు బ్రౌన్ రైస్ తింటూ ఉంటారు. కానీ వైట్ రైస్ తినడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది బ్రౌన్ రైస్ తింటూ ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే..

Red Rice Benefits: రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
Red Rice Benefits
Follow us

|

Updated on: Mar 29, 2024 | 2:35 PM

బియ్యాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ అందరూ ఎక్కువగా వైట్ రైసే తింటారు. ఇండియాలోని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా వైట్ రైస్ తింటారు. బరువు తగ్గాలి అనుకునేవారు, డయాబెటీస్, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు బ్రౌన్ రైస్ తింటూ ఉంటారు. కానీ వైట్ రైస్ తినడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది బ్రౌన్ రైస్ తింటూ ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఎప్పుడైనా రెడ్ రైస్ గురించి విన్నారా? ఇవి కూడా బియ్యమే. కానీ ఎరుపు రంగులో ఉంటాయి. రెడ్ రైస్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల పరిశోధనలో వెల్లడైంది. మరి రెడ్ రైస్ తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

రెడ్ రైస్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. రెడ్ రైస్‌ తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతుంది. దీంతో గుండెకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది.

డయాబెటీస్ కంట్రోల్:

రెడ్ రైస్ తినడం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ఎర్ర బియ్యం తినడం చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచకుండా నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ బియ్యాన్ని తినవచ్చు.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుతారు:

రెడ్ రైస్‌లో ప్రోటీన్స్, ఫైబర్ ఉంటాయి. దీంతో ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేరు. చిరుతిళ్లను కట్టడి చేస్తుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇలా ఎర్ర బియ్యం తింటే త్వరగా బరువు తగ్గొచ్చు.

చర్మానికి రక్షణగా ఉంటుంది:

ఎర్ర బియ్యంలో ఆంథోసైనిన్ అనేవి ఉంటాయి. ఇవి అతినీల లోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యం రాకుండా నివారిస్తుంది. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

శ్వాస సమస్యలు కంట్రోల్:

శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడేవారు రెడ్ రైస్ తినడం వల్ల అవి కంట్రోల్ అవుతాయి. అదే విధంగా జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా ఈ బియ్యం తింటే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..