AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపరంటే సూపర్.. రెండే రెండు లవంగాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వంటగదిలోని ఈ ప్రత్యేక మసాలా దినుసు.. ఆహార రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆయుర్వేద, ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉన్న లవంగాలు అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సూపరంటే సూపర్.. రెండే రెండు లవంగాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
Clove Benefits
Shaik Madar Saheb
|

Updated on: Aug 16, 2025 | 10:33 AM

Share

మన వంటింట్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు దాగున్నాయి.. ముఖ్యంగా మసాలా దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అలాంటి వాటిలో లవంగాలు ఒకటి.. లవంగాలలో ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయని.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లవంగాలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ-ఆక్సిడెంట్ – యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తాయి. దీనితో పాటు, ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.. దంత సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.. . అయితే, వేసవిలో వీటి వినియోగం గురించి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు లవంగాలను నోటిలో వేసుకుని నమలడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటున్నారు.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం.. లవంగాలలో యూజినాల్ అనే మూలకం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. కానీ దాని స్వభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా, వేసవిలో లవంగాలను అధికంగా తీసుకోవడం జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆమ్లత్వం, గ్యాస్ లేదా పిత్త సమస్యలు ఉన్నవారు లవంగాలను పరిమిత పరిమాణంలో ఉపయోగించాలి. లేకుంటే అది హాని కలిగిస్తుంది.

మీ ఆహారంలో లవంగాలను ఇలా చేర్చుకోండి:

వేసవిలో సోంపు, మిఠాయి లేదా గుల్కండ్ (గుల్కండ్ అనేది గులాబీ రేకులతో తయారు చేసిన ఒక తీపి పదార్థం) వంటి చల్లని ఆహారాలతో లవంగాలను తీసుకోవాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. తద్వారా దాని వేడి సమతుల్యంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీలో ఒకటి లేదా రెండు లవంగాలను జోడించడం లేదా ఆహారంలో మసాలాగా ఉపయోగించడం వేసవిలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గొంతు నొప్పి, దుర్వాసన, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

లవంగాల ప్రయోజనాలు

లవంగాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిలో జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, పంటి నొప్పి నుండి ఉపశమనం పొందడం వంటివి ఉన్నాయి. వేసవిలో కూడా పరిమిత పరిమాణంలో లవంగాలను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ అధిక వినియోగం శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది సమస్యలను కలిగిస్తుంది.

ఆయుర్వేదంలో లవంగాల ప్రయోజనాలు

ఆయుర్వేదంలో లవంగాలను చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, దీనిని ఏడాది పొడవునా తినవచ్చు. వేసవిలో, దీనిని చల్లని పదార్థాలతో కలిపి తినవచ్చు. కానీ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.. ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే.. వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..