AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుగంద ద్రవ్యాల్లో రారాణి.. ఆహారంలో రోజూ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!

స్వీట్ల నుంచి టీ వరకు ప్రతి వంటకంలోనూ దీనిని ఉపయోగిస్తాం. ఇది వంటకాల రుచిని పెంచడానికి మాత్రమేకాకుండా మంచి సువాసనను కూడా ఇస్తుంది. భోజనం తిన్న తర్వాత యాలకులను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తాం. కానీ యాలకుల వాడకం రుచికి మాత్రమే పరిమితం కాదు.. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా..

సుగంద ద్రవ్యాల్లో రారాణి.. ఆహారంలో రోజూ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
జీర్ణక్రియను సులభతరం చేస్తుంది: యాలకులు జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి. ఇది పేగు తిమ్మిరిని తగ్గించడం ద్వారా ఉబ్బరం, గ్యాస్ట్రిటిస్, గుండెల్లో మంట, సాధారణ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత యాలకులను నమలడం సాంప్రదాయ వైద్యంలో ఒక సాధారణ పద్ధతి. ఇలా చేయడం వల్ల కడుపు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
Srilakshmi C
|

Updated on: Aug 28, 2025 | 12:36 PM

Share

ప్రతి ఇంటి వంగ గదిలో ఉండే సుగంద ద్రవ్యాల్లో యాలకులు. స్వీట్ల నుంచి టీ వరకు ప్రతి వంటకంలోనూ దీనిని ఉపయోగిస్తాం. ఇది వంటకాల రుచిని పెంచడానికి మాత్రమేకాకుండా మంచి సువాసనను కూడా ఇస్తుంది. భోజనం తిన్న తర్వాత యాలకులను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తాం. కానీ యాలకుల వాడకం రుచికి మాత్రమే పరిమితం కాదు.. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా యాలకులు మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం నుంచి మానసిక ఆరోగ్యం వరకు ప్రతి ఆరోగ్య సమస్యకు దివ్యౌషధంగా పనిచేస్తుంది . కాబట్టి వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం

రోజూ యాలకులు నమలడం అలవాటు చేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్, ఉబ్బరం క్రమంగా తగ్గుతాయి.

రక్తపోటును నియంత్రణ

యాలకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. యాలకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు, యాలకులు తీసుకోవడం వల్ల మనస్సు, శరీరం సంతోషంగా ఉండటంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆందోళన, నిరాశ తొలగిపోతాయ్‌

యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆందోళన, నిరాశ నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులను నీటిలో మరిగించి తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీని వాసన మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.

చర్మానికి మెరుపు

యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. చర్మానికి మెరుపును ఇస్తుంది.

శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం

వర్షాకాలంలో దగ్గు, గొంతు నొప్పితో బాధపడేవారు యాలకుల టీ తాగడం మంచిది. యాలకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గొంతు సంబంధిత అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

పీరియడ్స్‌ సమస్యల నివారణ

పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, కండరాల నొప్పులతో బాధపడేవారికి యాలకుల నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. యాలకుల నీటిలో పుష్కలంగా యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం అందిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.