AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: చేతుల్లోని హృదయ రేఖలు బట్టి మీరు ఎలాంటి వారు.. మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు!

మన పెద్దవాళ్లు అరచేతిని చూసిన కొన్నిసార్లు మన భవిష్యత్తును అంచనావేస్తూ ఉంటారు. చిన్నప్పుడు మన అమ్మమ్మ, నాన్నమ్మలు మన అరచేతిలోని కొన్ని గీతలను చూసి నువ్వు పెద్దయ్యాక బాగా సంపాధిస్తావ్‌ అని చెప్పడం చాలా మంది ఫేస్‌ చేసి ఉంటారు. అయితే ఇది నిజమా అంటే అవుననే చెబుతున్నారు కొందరు నిపుణులు. హస్తసాముద్రికం ద్వారా మన అరచేతిలోని రేఖలను చూసి ఒక వ్యక్తి భవిష్యత్తు, ప్రవర్తనను అంచనా వేయవచ్చని చెబుతున్నారు. అయితే మన చేతిలో చాలా రేఖలు ఉంటాయి. వాటిలో హృదయ రేఖ కూడా ఒకటి దీని ద్వారా మీ వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.

Anand T
|

Updated on: Aug 28, 2025 | 3:30 PM

Share
ఎడమ చేతిలోని హృదయ రేఖ కుడి చేతిలోని హృదయ రేఖ పైన ఉంటే: మీరు మీ రెండు చేతులు కలిపినప్పుడు ఎడమ చేతిలోని హృదయ రేఖ కుడి చేతిలోని హృదయ రేఖ పైన ఉంటే, మీరు సృజనాత్మక, సహజమైన వ్యక్తి అని అర్థం. మీరు ఎక్కువగా స్వేచ్చను ఇష్టపడుతారు,  స్వతంత్రంగా జీవించాలనుకునే వారు అని అర్థం

1 / 6
మీరు ఎల్లప్పుడూ కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలను అన్వేషించడానికి ఇష్టపడతారు. మీకు ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. ఎవరు చిన్న మాట అన్నా పడరు. మీరు దేనికీ ఎవరిపైనా ఆధారపడటానికి ఇష్టపడరు. ప్రత్యేకమైన వ్యక్తులుగా, మీరు జీవితాన్ని ఒక జర్నీలా గడపాలని కోరుకుంటారు.

2 / 6
రెండు చేతుల్లోని హృదయ రేఖలు సమానంగా ఉంటే: మీ రెండు చేతుల్లోని హృదయ రేఖలు సమానంగా ఉంటే, మీరు సామరస్యంగా జీవించే వ్యక్తి అని అర్థం. మీరు తెలియని వారితో కూడా ఈజీగా కలిసిపోతారు. మీరు ఎప్పుడూ శాంతియుతంగా, సంయమనంతో ఉండాలనుకుంటారు.

3 / 6
ఇద్దరి మధ్య ఏదైనా చర్చ జరిగినప్పుడు, మీరు రెండు వైపులా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. ఒక్కరివైపు అస్సలు మాట్లాడరు. మీరు భావోద్వేగమైన వ్యక్తులు. మీరు అందరితో మంచి సంబంధాలను కొనసాగించాలని అనుకుంటారు.

4 / 6
మీ కుడి చేతిలోని హృదయ రేఖ ఎడమ చేతి కంటే పైకి ఉంటే: మీ కుడి చేతిలోని హృదయ రేఖ ఎడమ చేతి కంటే పైకి ఉంటే, మీరు భావోద్వేగపరంగా తెలివైన వ్యక్తి అని అర్థం. మీ నిర్ణయాలు పూర్తిగా భావోద్వేగాలపై ఆధారపడి ఉండవు. మీరు భావాల కంటే నిజాలనే ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల, మీ బలాలు, సూత్రాలపై మీకు నమ్మకం ఉంటుంది.  ఇది మిమ్మల్ని మరింత బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది

5 / 6
మరొక విషయం ఏమిటంటే, మీరు ఎప్పుడూ మీ లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. ఆ లక్ష్యాలను సాధించడానికి శ్రద్ధగా పనిచేస్తారు. మీరు అందరితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. మీరు ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.

6 / 6