Bottle Gourd: సొరకాయ తింటే చర్మం మెరిసిపోతుంది.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!
మాంసాహార పదార్థాల్లోనే కాదు.. కూరగాయల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. కూరగాయలు తినడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ నిత్యం తినే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయలో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సొరకాయను కేవలం కూరలాగానే కాకుండా.. స్నాక్స్‌లా కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. అందులోనూ వేసవిలో సొరకాయ తినడం వల్ల చాలా మంచిది. శరీరానికి చాలా చలువ..

మాంసాహార పదార్థాల్లోనే కాదు.. కూరగాయల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. కూరగాయలు తినడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ నిత్యం తినే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయలో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సొరకాయను కేవలం కూరలాగానే కాకుండా.. స్నాక్స్‌లా కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. అందులోనూ వేసవిలో సొరకాయ తినడం వల్ల చాలా మంచిది. శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఇంకా సొరకాయ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వెయిట్ లాస్ అవ్వొచ్చు:
బరువు తగ్గాలి అనుకునే వారు సొరకాయను మీ డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్దీగా బరువు తగ్గొచ్చు. ఇందులో ఫైబర్‌తో పాటు నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి సొరకాయ కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంతే కాకుండా ఆకలి కూడా పెద్దగా వేయదు.
జీర్ణ క్రియకు చాలా మంచిది:
సొరకాయ తినడం వల్ల జీర్ణ క్రియకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్.. తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా మల బద్ధకం సమస్య కూడా తలెత్తదు. అంతే కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
మధుమేహం కంట్రోల్ అవుతుంది:
సొరకాయ తినడం వల్ల డయాబెటీస్‌ను అదుపు చేయవచ్చు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు మధుమేహాన్ని నియంత్రించడంలో బాగా సహాయ పడతాయి. ఇది తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి.
కాలేయానికి మంచిది:
సొరకాయ తినడం వల్ల కాలేయానికి కూడా చాలా మంచిది. కాలేయ కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్ర పరచడానికే కాకుండా.. కాలేయ వ్యాధులను నివారించడానికి కూడా సహాయ పడతాయి. అంతే కాకుండా ఇందులో ఉండే పొటాషియం.. రక్త పోటును నియంత్రించడానికి కూడా ఉపయోగ పడుతుంది.
చర్మం – జుట్టుకు మంచిది:
సొరకాయ తినడం వల్ల చర్మం, జుట్టుకు కూడా చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ యంగ్‌గా ఉండేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు నివారించడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)