ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే చాలు.. ఫుల్ హెల్త్, బ్యూటీ మీ సొంతం..!
కలబంద మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది ఇంటిని అందంగా మార్చడమే కాకుండా.. స్కిన్, హెయిర్, ఆరోగ్యానికి సహజమైన ఔషధంగా పనిచేస్తుంది. తక్కువ కేర్ తో సులభంగా పెరిగే ఈ మొక్క గాలి శుభ్రం చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

Aloe Veera Plant
కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంట్లో చాలా ఈజీగా, తక్కువ శ్రమతో పెంచుకోవచ్చు. ఇల్లు గ్రీన్‌గా ఉండటమే కాదు.. మనసుకి కూడా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది. కలబంద మొక్కను పెంచడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
కలబంద వల్ల కలిగే లాభాలు
- బ్యూటిఫుల్ డెకరేషన్.. కలబంద మొక్క దాని గ్రీన్ లీవ్స్, యూనిక్ షేప్‌తో ఇంటికి ఒక బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. చిన్న స్పేస్‌లో కూడా ఈ ప్లాంట్‌ను పెట్టుకోవచ్చు.
- ఫాస్ట్ గ్రోత్ వేరే ప్లాంట్స్‌తో పోలిస్తే కలబంద చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఒకసారి పెరిగాక, దాని నుంచి చిన్న చిన్న పిల్ల మొక్కలు వస్తాయి. దీంతో మీరు మరిన్ని మొక్కలను పెంచుకోవచ్చు.
- మెడిసినల్ జెల్.. కలబంద లీవ్స్‌లో ఉండే ట్రాన్స్పరెంట్ జెల్‌లో మెడిసినల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్‌కు తేమను అందిస్తుంది, చిన్న గాయాలు, కాలిన గాయాలను తగ్గిస్తుంది.
- ఎయిర్ ప్యూరిఫైర్.. ఈ మొక్క ఎయిర్‌లో ఉండే హానికరమైన కెమికల్స్‌ను (ఫార్మాల్డిహైడ్, బెంజీన్ లాంటివి) తొలగించి ఇంటి వాతావరణాన్ని క్లీన్‌గా ఉంచుతుంది.
- లో మెయింటెనెన్స్.. కలబందకు ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం సూర్యరశ్మి ఉంటే చాలు. తక్కువ కేరింగ్‌తో ఈజీగా పెంచుకునే మొక్క ఇది.
- ఈజీగా కొత్త మొక్కలు.. కలబంద మొక్క నుంచి వచ్చే చిన్న పిల్లలను వేరుగా నాటితే కొత్త మొక్కలు అవుతాయి. అందుకే ఒక మొక్కతో చాలా ప్లాంట్స్ పెంచుకోవచ్చు.
- హెల్త్ బెనిఫిట్స్.. కలబందను స్కిన్ కేర్, హెయిర్ హెల్త్ కోసం బాగా వాడతారు. అలాగే ఇది డైజెషన్ సిస్టమ్‌ను మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది.




