Health Tips: శరీరంలో కాల్షియం లోపమా..? ఈ ఆహారాలతో సమస్యకు వెంటనే చెక్ పెట్టేయండి..
Health Tips: శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సరిపడిన మోతాదులో అందినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒక వేళ పోషకాలు శరీరానికి అందలేదంటే పోషక లోపంతో పాటు అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ఇలా శరీరానికి అవసరమైన పోషకాల్లో కాల్షియం కూడా ఒకటి. శరీరంలో కాల్షియం లోపం ఏర్పడితే..
Health Tips: శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సరిపడిన మోతాదులో అందినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒక వేళ పోషకాలు శరీరానికి అందలేదంటే పోషక లోపంతో పాటు అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ఇలా శరీరానికి అవసరమైన పోషకాల్లో కాల్షియం కూడా ఒకటి. శరీరంలో కాల్షియం లోపం ఏర్పడితే మన ఎముకలు బోలుగా, సాంద్రత లేనివిగా మారి బలహీనపడిపోతాయి. ఇంకా అనుకోకుండా తగిలే చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవడం, పగుళ్లు ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి సమస్య బారిన పడకుండా ఉండేందుకు తీసుకునే ఆహారంలో కాల్షియం పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో కాల్షియం కోసం లేదా కాల్షియం లోపాన్ని అధిగమించేందుకు ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
పాలు, పాల ఉత్పత్తులు: కాల్షియం కూడా పాలు ఉత్తమ ఆహార ఎంపిక. పాలల్లోనే కాక పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి పాల ఉత్పత్తులు కూడా కాల్షియానికి ఉత్తమ మూలంగా ఉంటాయి.
సోయాబీన్: కాల్షియం లోపాన్ని అధిగమించేందుకు తినదగిన ఆహారాల్లో సోయాబీన్స్ కూడా ఉన్నాయి. వీటి నుంచి కాల్షియంతో పాటు ఐరన్, ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది.
కూరగాయలు: కాల్షియం లోపమే కాక ఇతర ఏ పోషక లోపం ఏర్పడినా కూరగాయలను తీసుకోవడం చాలా ఉత్తమ పద్దతి. కూరగాయల నుంచి శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్స్, కార్బ్స్, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి.
పండ్లు: కూరగాయల మాదిరిగానే పండ్లు కూడా కాల్షియంతో సహా ఇతర పోషకాల కోసం ఉత్తమ ఎంపిక.
ఉసిరి: యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలను కలిగిన ఉసిరికాయతో కాల్షియం లోపాన్నికూడా అధిగమించవచ్చు. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా కల్పిస్తాయి.
గుడ్లు: ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్లు తీసుకుంటే కాల్షియం లోపాన్ని తేలికగా అధిగమించవచ్చు. గుడ్లను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా లభిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..