Health Tips: ఈ మసాలా కొలెస్ట్రాల్‌కి శత్రువు.. తిన్నారంటే ఆ సమస్యల నుంచి సురక్షితం..

Cinnamon For Cholesterol: సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తే అన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. కానీ ప్రస్తుతం మనపై ఉన్న కుటుంబ, ఉద్యోగ బాధ్యతల కారణంగా అది అసాధ్యంగా మారింది. అయితే ఈ క్రమంలో వంటగదిలోని కొన్ని పదార్థాలను తప్పనిసరిగా

Health Tips: ఈ మసాలా కొలెస్ట్రాల్‌కి శత్రువు.. తిన్నారంటే ఆ సమస్యల నుంచి సురక్షితం..
Cinnamon

Updated on: Jul 07, 2023 | 6:18 PM

Cinnamon For Cholesterol: సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తే అన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. కానీ ప్రస్తుతం మనపై ఉన్న కుటుంబ, ఉద్యోగ బాధ్యతల కారణంగా అది అసాధ్యంగా మారింది. అయితే ఈ క్రమంలో వంటగదిలోని కొన్ని పదార్థాలను తప్పనిసరిగా ఆహారంలో కలిపి తీసుకున్నా సరిపోతుంది. అలాంటి పదార్థాలు లేదా మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. ప్రస్తుతం మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రథమ స్థానంలో ఉన్న గుండె సంబంధిత సమస్యలకు ఇది ఒక దివ్యౌషధం. ముఖ్యంగా గుండె జబ్బులకు కారణమైన కొలెస్ట్రాల్‌కి ఇది యమపాశం. దీనిలోని గుణాలు అలాంటివి మరి. ఇందులోని సిన్నమాల్డిహైడ్, సిన్నమిక్ యాసిడ్, సిన్నమేట్ వంటి సమ్మేళనాలు.. కేలరీలు, ప్రొటిన్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఏ వంటి అనేక రకాల పోషకాలు మన ఆరోగ్యాన్ని సంరక్షించడంలో అలాగే సమస్యలను దూరం చేయడంలో ఉపయోగకరంగా ఉంటాయి.

ఇంకా దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇంకా పలు అధ్యయనాల ప్రకారం ఇది నిరూపితమయిన విషయం కూడా. అంతేకాక దాల్చిన చెక్క బ్లడ్ షుగర్‌ని కూడా నియంత్రిస్తుంది. ఒక వేళ మీ శరీరంలోని కొలెస్ట్రాల్ తొలగిపోకపోతే అది రక్తపోటు, హార్ట్ ఎటాక్ సహా పలు రకాల గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. అందువల్ల ఆహారంలో దాల్చిన చెక్క తప్పనిసరిగా ఉండేలా చూస్కోవాలని నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్కను ఎలా తీసుకోవాలి?

ఇవి కూడా చదవండి

దాల్చినచెక్క అనేక రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. కూరల్లో మసాలాగా, టీలో, గోరువెచ్చని నీటిలో పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే దాల్చినచెక్కను అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక సరిపాళ్లలో మాత్రమే తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..