- Telugu News Photo Gallery Spiritual photos For Wealth and prosperity, Follow these vastu Tips While performing puja to Tusli Plant
Tulsi Vastu: తులసి మొక్కకు పాలు, నీళ్లు కాకుండా.. ఈ వస్తువును సమర్పిస్తే.. లక్ష్మీకటాక్షం కలుగుతుంది..!
తులసి వాస్తు చిట్కాలు: వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఉండడం చాలా అవసరం. వాస్తు నియమాలను అనుసరించి తులసి కోటను ఇంట్లో సరైన దిశలో ఏర్పాటు చేస్తే ఎన్నో రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇంకా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
Updated on: Jul 07, 2023 | 4:45 PM

సనాతన హిందూ ధర్మంలో తులసి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసి దానికి ప్రతిదినం పూజ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా వాస్తు,యు జ్యోతిష్యం ప్రకారం తులసి మొక్కకు మన తలరాతను మార్చగల శక్తి ఉంది.

చాలా మంది తులసి వేరుపై నీటికి బదులుగా పాలు లేదా పాల నీళ్లు పోస్తారు. అలా చేస్తే అకస్మాత్తుగా సంపద పెరుగుతుందని అనుకుంటే అది పెద్ద తప్పే. ఎందుకంటే శ్రీమహాలక్ష్మి కేవలం పాలతో, నీళ్లతో సంతృప్తి చెందదు.

ఇంట్లో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నవారు.. తులసి మొక్కపై పాలు లేదా నీళ్లకు బదులుగా చెరుకు రసం పోయవచ్చు. ఇలా చేసే ముందు మీ పేరు, గోత్రనామాలను ఏడు సార్లు పఠిస్తే చక్కని ఫలితాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కోసం ప్రతి రోజూ ఉదయం మంగళ స్నానం చేసి తులసి మొక్కకు నమస్కరించాలి.

ఇంకా ఉదయం, సాయంత్రం వేళల్లో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. తులసి వేళ్లను మెడలో తాయత్తుగా ధరించడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. .




