Beauty Care Tips: మొటిమల మచ్చలు ఎలా వదిలించుకోవాలి? అద్భుతమైన హోమ్‌ రెమెడీస్‌

చాలా మంది ముఖంపై మొటిమలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇతరులకన్నా అందంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . అయితే వాతావరణం మారుతున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వేసవిలో ఎండ వేడిమి కారణంగా, చర్మం నల్లబడటం, ముడతలు, మొటిమలు, వాపు సమస్య, చర్మం చికాకు మొదలైనవి. మొటిమలు, దాని మచ్చలు ముఖం అందాన్ని పాడు

Beauty Care Tips: మొటిమల మచ్చలు ఎలా వదిలించుకోవాలి? అద్భుతమైన హోమ్‌ రెమెడీస్‌
Acne Problem
Follow us
Subhash Goud

|

Updated on: May 14, 2024 | 9:45 AM

చాలా మంది ముఖంపై మొటిమలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇతరులకన్నా అందంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . అయితే వాతావరణం మారుతున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వేసవిలో ఎండ వేడిమి కారణంగా, చర్మం నల్లబడటం, ముడతలు, మొటిమలు, వాపు సమస్య, చర్మం చికాకు మొదలైనవి. మొటిమలు, దాని మచ్చలు ముఖం అందాన్ని పాడు చేస్తాయి. అందుకే ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించవచ్చు.

  1. మొటిమలను నయం చేయడంలో పసుపు, తులసి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రెండు చెంచాల పచ్చి పసుపు, ముప్పై తులసి ఆకులను కడిగి మెత్తగా చేయాలి. ఈ పేస్ట్‌ని మొటిమల మీద రాసి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమల సమస్యలు దూరమవుతాయి.
  2. వేప ఆకుల్లో మంచి క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఈ వేప ఆకులను చూర్ణం చేసి, వాటిని రెండు చెంచాల రోజ్ వాటర్‌తో మిక్స్ చేసి మొటిమల మీద అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు ఉంటాయి.
  3. ఒక చెంచా స్వచ్ఛమైన తేనెను చిన్న దూదిలో ముంచి మొటిమల మీద ఉంచి అరగంట తర్వాత కడిగితే ఫలితం ఉంటుంది.
  4. గంధం మొటిమలకు ఉత్తమ ఔషధంగా చెబుతారు. గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలిపి మందపాటి పేస్ట్‌లా చేసి మొటిమల మీద రాస్తే చల్లదనం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల మొటిమల సమస్యల నుంచి బయటపడవచ్చు.
  5. రెండు చెంచాల నీళ్లలో కొద్ది మొత్తంలో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ నానబెట్టి మొటిమలపై ఉంచితే మొటిమలు త్వరగా ఆరిపోతాయి. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసాన్ని చర్మానికి ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి