AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Safety: టపాసుల భయం.. పెట్ లవర్స్ కు వెటర్నిటీ వైద్యులు ఇస్తోన్న సేఫ్టీ టిప్స్ ఇవే..

దీపావళి పండుగ మనందరికీ ఆనందం, వెలుగులు, ఉత్సాహం నింపుతుంది. అయితే, టపాసులు కాల్చేటప్పుడు వాటి భారీ శబ్దాలు ఇంట్లో ఉండే వృద్ధులకు, పెంపుడు జంతువులకు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా శునకాలకు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బాంబుల శబ్దాలు వాటికి అధిక ఒత్తిడిని, భయాన్ని కలిగిస్తాయి. ఈ సమయంలో అవి భయంతో మూలల్లో దాక్కుంటాయి. పెంపుడు జంతువుల తల్లిదండ్రుల ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, జిగ్లీలోని హెడ్ వెటర్నరీ డాక్టర్ దీపక్ సరస్వత్ గారు, టపాసుల శబ్దాల నుంచి శునకాల ఒత్తిడిని తగ్గించడానికి తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు.

Pet Safety: టపాసుల భయం.. పెట్ లవర్స్ కు వెటర్నిటీ వైద్యులు ఇస్తోన్న సేఫ్టీ టిప్స్ ఇవే..
Diwali Pet Safety
Bhavani
|

Updated on: Oct 20, 2025 | 3:11 PM

Share

దీపావళి వేడుకల్లోని పెద్ద శబ్దాలు, వెలుగులు శునకాలకు తీవ్ర ఒత్తిడి కలిగిస్తాయి. పెంపుడు జంతువుల తల్లిదండ్రులు వారి పెంపుడు జంతువుల భయాన్ని, ఒత్తిడిని తగ్గించడానికి ఈ 5 చిట్కాలు పాటించాలి. వెటర్నరీ డాక్టర్ దీపక్ సరస్వత్ ప్రకారం, టపాసుల పేలుళ్లు నిరంతరం ఉన్నప్పుడు శునకాలు త్వరగా గందరగోళానికి గురవుతాయి. ఒత్తిడికి లోనవుతాయి. వాటిని సురక్షితంగా, ప్రశాంతంగా ఉంచడానికి ఇక్కడ 5 ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి:

ప్రశాంతమైన, సురక్షిత స్థలాన్ని ఏర్పాటు చేయండి:

కిటికీలు లేక తలుపుల దగ్గర కాకుండా, ఇంట్లో ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి.

కుక్కకు ఇష్టమైన బెడ్, దుప్పట్లు, బొమ్మలు అక్కడ ఉంచండి.

కిటికీలకు పరదాలు వేయడం, తలుపులు మూయడం వలన పెద్ద శబ్దాలు మఫ్ఫిల్ అవుతాయి. మెరుస్తున్న కాంతి నుంచి రక్షణ లభిస్తుంది.

ఓదార్పునిచ్చే శబ్దాలు వాడండి:

టపాసుల శబ్దాలు వినబడకుండా ఉండటానికి, ఇంట్లో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రశాంతమైన సంగీతం ప్లే చేయండి లేక టీవీ ఆన్ చేయండి.

సున్నితమైన ట్యూన్‌లు లేక పెంపుడు జంతువుల ప్లేలిస్ట్‌లు ఆకస్మిక శబ్దాల నుంచి శునకాన్ని దూరం చేసి, ఒత్తిడిని తగ్గిస్తాయి.

దగ్గరగా ఉండి ఓదార్చండి:

మీ పెంపుడు జంతువు ఒత్తిడిగా ఉన్నట్టు అనిపిస్తే, దానితో ఎక్కువ సమయం గడపండి. సున్నితంగా దగ్గరకు తీసుకుని ముద్దు చేసి ఓదార్చండి.

కొన్ని శునకాలు మసాజ్‌ను ఆస్వాదిస్తాయి. వాటి స్పందనను గమనించి, అవి ఇష్టపడే విధంగా ప్రశాంతపరచండి.

టపాసులు ఎక్కువగా కాల్చే రాత్రి వేళల్లో వాటిని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లకూడదు.

 బయట సమయాన్ని తగ్గించండి:

టపాసులు కాల్చే సమయానికి దూరంగా, ఉదయం పూట లేక నిశ్శబ్దంగా ఉన్న సమయంలోనే వాకింగ్ పూర్తి చేయండి.

బయట నడిపించేటప్పుడు ఎప్పుడూ పట్టీ (Leash) ఉపయోగించండి. శబ్దం, రద్దీగా ఉండే ప్రాంతాలను మానుకోవాలి.

టపాసులు కాల్చే అవకాశం ఉన్నప్పుడు శునకాన్ని బయటకు తీసుకెళ్లకపోవడమే మంచిది. ప్రమాదవశాత్తు బయటకు వెళ్లకుండా ఇంటి తలుపులు మూసి ఉన్నాయని నిర్ధారించుకోండి.

అవసరమైతే కామింగ్ ప్రొడక్ట్స్ వాడండి:

మీ శునకం అధికంగా ఆందోళన చెందుతుంటే, వెటర్నరీ డాక్టర్ సిఫార్సు చేసిన యాంగ్జైటీ వెస్ట్‌లు లేక ఫెరోమోన్ డిఫ్యూజర్‌లు ఉపయోగించండి.

ఒత్తిడి లేక డీహైడ్రేషన్ తగ్గించడానికి పెంపుడు జంతువుకు తగినంత నీరు అందుబాటులో ఉంచండి. కొత్త చిట్కాలు ప్రయత్నించే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి.

ఈ చిట్కాలు పాటించడం వలన దీపావళి రోజున మీ పెంపుడు జంతువు సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం వెటర్నరీ డాక్టర్ సలహాపై ఆధారపడింది. పెంపుడు జంతువుల వైద్యపరమైన సమస్యలు, చికిత్స కోసం ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.