Green Tea Bags: గ్రీన్ టీ తాగాక… ఆ బ్యాగులు పడేస్తున్నారా..? ఆగండాగండి.. ఎన్నో బెనిఫిట్స్
గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి దాదాపు మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో చాలా మంది కాఫీకి బదులుగా గ్రీన్ టీని తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గ్రీన్ టీ తాగిన తర్వాత చాలా మంది గ్రీన్ టీ బ్యాగులను చెత్తబుట్టలో వేస్తుంటారు. బదులుగా వాటిని అనేక విధాలుగా తిరిగి ఉపయోగించుకోవచ్చు. అవన్నీ తెలిస్తే.. అరె వాడి పారేసిన గ్రీన్ టీ ప్యాకెట్లతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే మీరు అవాక్కవ్వడం పక్కా. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని మనందరకు తెలిసిన విషయమే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. అలాగే బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో హెల్ప్ అవుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వల్ల, ప్రజంట్ చాలా మంది ప్రజలు గ్రీన్ టీ తాగడం డైలీ అలవాటుగా మార్చుకుంటున్నారు. గ్రీన్ టీ తాగేందుకు చాలా మంది టీ బ్యాగ్స్‌ను ఉపయోగిస్తారు. దానిని వేడి నీటిలో ఉంచి టీ తాగిన అనంతరం.. ఆ బ్యాగ్స్‌ను పక్కన పడేస్తారు. కానీ ఆ ప్యాకెట్‌లోని గ్రీన్ టీ ఆకులను తిరిగి యూజ్ చేయలేమన్నది వాస్తవమే. బదులుగా, ఆ టీ బ్యాగ్‌లను అనేక విధాలుగా రీ యూజ్ చేయొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
మొక్కలకు ఎరువులు:
గ్రీన్ టీ బ్యాగ్ యూజ్ చేసిన తర్వాత పడేయకండి. టీ బ్యాగ్‌ను కత్తిరించి, ఆకులను ఇంట్లో ఉన్న పూల తోట లేదా కూరగాయల మొక్కల వేర్ల వద్ద పడేయండి. దీంతో మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి. అలాగే ఇది నేలలో పోషకాల స్థాయిని పెంచుతుంది. మొక్కల వేర్లు బాగా పెరగడానికి హెల్ప్ అవుతుంది.
రిఫ్రిజిరేటర్ వాసనలు తొలగించడానికి:
ఫ్రిజ్‌లో వెలువడే దుర్వాసనను పోగొట్టేందుకు గ్రీన్ టీ బ్యాగ్ ఉపయోగపడుతుంది. దీని కోసం గ్రీన్ టీ బ్యాగ్ ఉపయోగించిన తర్వాత, ఆ ఆకులను బయటకు తీసి ఆరబెట్టండి. తర్వాత వాటిని ఒక బౌల్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాల వాసనను తొలగించి.. తాజా వాసనను స్ప్రెడ్ చేయడానికి సహాయపడుతుంది.
నాన్-స్టిక్ పాన్ శుభ్రం చేయడానికి:
నాన్ స్టిక్ పాన్ లేదా ఏదైనా పాత్ర నుండి జిడ్డను ఎలా తొలగించాలి అని ఆలోచిస్తున్నారా?. అయితే ఈ టిప్ మీ కోసమే గ్రీన్ టీ బ్యాగ్ సహాయంతో వాటిని ఈజీగా క్లీన్ చేయవచ్చు. అందుకోసం ముందుగా గ్రీన్ టీ బ్యాగ్ ను జిడ్డు పేరుకుపోయిన నాన్ స్టిక్ డబ్బా లేదా పాత్రలో వేసి వేసి వేడి నీళ్లతో నింపాలి. రాత్రంతా నాననిస్తే.. ఉదయం పాత్రలోని జిడ్డు ఈజీగా తొలగిపోతుంది.
కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి:
కళ్ల కింద నల్లటి వలయాలు లేదా కళ్ల చుట్టూ వాపు ఉంటే గ్రీన్ టీ ఈ సమస్యలను దూరం చేస్తుంది. టీ చేయడానికి ఉపయోగించే గ్రీన్ టీ బ్యాగ్‌ని కాసేపు ప్రిజ్‌లో ఉంచండి. అవి కూల్ అయ్యాక.. బయటకు తీసి ప్రతిరోజూ కళ్లపై కాసేపు మర్దన చేయండి. దీని వల్ల కొద్ది రోజుల్లోనే కళ్ల చుట్టూ ఉబ్బిన ఛాయలు, నల్లటి వలయాల నుండి రిలీఫ్ పొందవచ్చు.
చెమట దుర్వాసన తొలగించడానికి:
కొంతమందికి విపరీతమైన చెమట పోస్తూ ఉంటుంది. దీని వలన తీవ్ర దుర్వాసన వస్తుంది. ఈ సందర్భంలో, స్నానపు నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ ఉంచండి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. చెమట వాసనను దూరం చేస్తుంది.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




