AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి విషపదార్థాలను, హానికరమైన క్రిములను తొలగిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్‌లను చురుకుగా చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..
Drinking Warm Water On An Empty Stomach
Krishna S
|

Updated on: Nov 04, 2025 | 7:10 AM

Share

మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో తెలిసిందే. క్రమం తప్పకుండా సరైన మొత్తంలో నీరు తాగడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నీరు శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. అయితే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

గోరువెచ్చని నీరు – 5 అద్భుత ప్రయోజనాలు

శరీరాన్ని శుభ్రపరుస్తుంది

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు విషాన్ని తొలగిస్తాయి. గోరువెచ్చని నీరు శరీరంలోని హానికరమైన పదార్థాలు, క్రిములు మొదలైన వాటిని బయటకు పంపడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ..

గోరువెచ్చని నీరు త్రాగడం వలన శరీరంలోని అవాంఛిత కొవ్వు కరుగుతుంది. నిరంతరంగా దీనిని తాగడం వల్ల మూడవ రోజు నుంచే మీ బరువులో గణనీయమైన తేడా కనిపించడం ప్రారంభమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

జీర్ణవ్యవస్థను బలోపేతం

ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే ప్రయోజనకరమైన ఎంజైమ్‌లు చురుకుగా అవుతాయి. దీని ఫలితంగా జీర్ణక్రియ వేగంగా మెరుగ్గా జరుగుతుంది.

ఒత్తిడిని తగ్గించి

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల హైడ్రేషన్ నివారించబడుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శరీరం నుండి ఒత్తిడిని తొలగిస్తుంది. అలాగే, మనసుకు విశ్రాంతి లభిస్తుంది. శరీరానికి సహజ శక్తి అందుతుంది.

చర్మాన్ని కాంతివంతం చేస్తుంది

ఉదయం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది ముఖంపై వచ్చే మొటిమలు, చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..