AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నొప్పే కదా అని అలా వదిలేయకండి

కూర్చొని చాలా సేపు పనిచేయడం, సమయానికి తినకపోవడం, ఒత్తిడి ఇలా ఎన్నో కారణాలు నొప్పులకు కారణాలు అవుతాయి. కొన్నిసార్లు నొప్పి వస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోగా, మరి కొన్నిసార్లు మాత్రం వారం, పదిరోజుల వరకు ఉంటుంది. దీంతో వెన్నునొప్పిని చాలామంది పట్టించుకోరు. అయితే ఎలాగూ పోతుంది కదా అంటూ ఏ నొప్పిని అలానే వదిలేయకండి అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు రకాల నొప్పులను ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి అంటూ వారు సూచిస్తున్నారు. పిత్తాశయంలో […]

నొప్పే కదా అని అలా వదిలేయకండి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:27 PM

Share

కూర్చొని చాలా సేపు పనిచేయడం, సమయానికి తినకపోవడం, ఒత్తిడి ఇలా ఎన్నో కారణాలు నొప్పులకు కారణాలు అవుతాయి. కొన్నిసార్లు నొప్పి వస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోగా, మరి కొన్నిసార్లు మాత్రం వారం, పదిరోజుల వరకు ఉంటుంది. దీంతో వెన్నునొప్పిని చాలామంది పట్టించుకోరు. అయితే ఎలాగూ పోతుంది కదా అంటూ ఏ నొప్పిని అలానే వదిలేయకండి అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు రకాల నొప్పులను ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి అంటూ వారు సూచిస్తున్నారు.

పిత్తాశయంలో నొప్పి కొంతమందికి పిత్తాశయంలో తరచుగా నొప్పిని పొందుతుంటారు. అలా ఉన్నవారు వెంటనే ఈఆర్ చెకింగ్ చేయించుకోవాలంటూ డాక్టర్లు చెబుతున్నారు. ఈ నొప్పి వలన పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని, నరాలు కుంచించుకుపోతే మానవ శరీరంలో జరిగే చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని డాక్టర్ ఆనంద్ పేర్కొన్నారు.

జ్వరంతో కూడిన నొప్పి కొంతమందికి వెన్నునొప్పి ఉన్నప్పుడు తరచుగా జ్వరం వస్తూ ఉంటుంది. అలా ఉన్న వారికి సీరియస్ ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉందని నార్త్ కారోలినాకు చెందిన వెన్నెముక సర్జన్ డేవిడ్ ఆండర్సన్ తెలిపారు. ఇది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుందని, చాలామందికి ఎన్నో కారణాల వలన జ్వరం వస్తూ ఉంటుందని, అయితే ఆ సమయంలో వెన్నెముక తీవ్రంగా నొప్పిని తెప్పిస్తుంటే మన మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.

కాలి భాగంలో నొప్పి ఒక్కోసారి నడుస్తున్నప్పుడు, కాళ్లలో సత్తువ లేకపోవడం వలన తిమ్మిరిలు రావడం, అడుగు తీసి అడుగు వేయలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా వచ్చిన నొప్పులను ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి అంటూ డాక్టర్ ఆనంద్ చెప్పారు. దీని వలన శరీరంలోని అన్ని ఎముకలపై ప్రభావం పడనుందని వెల్లడించారు.

మెడ కింద నొప్పి మెడ భాగంలో వచ్చే నొప్పిని చాలా మంది తేలికగా తీసుకుంటారు. అయితే మెడ వెనుక భాగంలో వెన్నెముక ఉంటుంది. అక్కడ మెదడు నుంచి వెన్నెముకకు కనెక్షన్ ఉంటుంది. అందుకే ఈ నొప్పిని ఏ మాత్రం వదిలేయకండి అంటూ డాక్టర్లు చెబుతున్నారు. నొప్పులు సాధారణంగా ఉంటాయి కదా అని చాలామంది తేలికగా తీసుకుంటారని, కానీ అది మనిషి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని, అందుకే ఏ నొప్పులు వచ్చినా వదిలేయకండి అంటూ డాక్టర్లు సూచిస్తున్నారు.

Follow Us
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!