AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Ginger: చిటికెడు అల్లంతో ఆ పది సమస్యలకు చెక్‌.. రోజూ తింటే వాటికి చూమంత్రి వేసినట్టే

10 benefits of ginger: మనం చేసుకునే వంటకాలకు రుచి, వాసన రావాలంటే అల్లం కచ్చితంగా ఉండాల్సిందే.. అల్లం కేవలం సుగంధ ద్రవ్యంలానే కాకుండా, సహజ ఔషధం కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఆయుర్వేదంలో అల్లంను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. అంతేకాదు ఇది మన అనేక రకాల వ్యాధుల బారి నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. రోజూ చిటికెడు అల్లం ముక్కను తినడం ద్వారా చాలా సమస్యలకు మనం చెక్‌ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Benefits of Ginger: చిటికెడు అల్లంతో ఆ పది సమస్యలకు చెక్‌.. రోజూ తింటే వాటికి చూమంత్రి వేసినట్టే
10 Benefits Of Ginger
Anand T
|

Updated on: Oct 30, 2025 | 6:01 PM

Share

అత్యంత ప్రయోజనకరమైన సుగంధ ద్రవ్యాలలో అల్లం కూడా ఒకటి. అందుకే దీనిని ఆహారం, గృహ నివారణలలో తనచూ ఉపయోగిస్తారు. అంతేకాదు అల్లం మన శరీరంలోనే అనే సమస్యలను దూరం చేస్తుంది. రోజూ చిటికెడు అల్లం తినడం కారణంగా అల్లంలో ఉండే యాంటీవైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడుతాయి. అలాగే ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. అల్లం మీ గుండెకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం సాధారణ అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుంది. శరీర అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అల్లం ఒక అద్భుతమైన సహజ ప్రభావవంతమైన పదార్ధం.

అల్లం యొక్క 10 ప్రయోజనాలు

జలుబు – దగ్గు: అల్లం దగ్గు, జలుబు నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని అందరికీ తెలుసు. వీటితో పాటు అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన గొంతు నొప్పిని తగ్గించడంలో, కఫాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడతాయి.

వికారం – వాంతులు: జలుబు లేదా ప్రయాణ అనారోగ్యం కారణంగా మీకు వికారం లేదా వాంతులు అనిపిస్తే, అల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీకు వికారం లేదా వాంతులు అనిపించినప్పుడు కొంచెం అల్లం ముక్కను నోట్లో పెట్టుకోవడం ద్వారా వాటి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

గ్యాస్ – అజీర్ణం: అల్లంలోని సమ్మేళనాలు మీ జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్ – అజీర్ణాన్ని నివారిస్తుంది. ఇందుకోసం మీరు అల్లంను మరిగించి ఆ నీటిని త్రాగవచ్చు.

ఆకలిని పెంచుతుంది: కొంతమందికి ఎక్కువగా ఆకలి వేయదు, తరచుగా వారు చాలా తక్కువగా తింటామని లేదా ఆకలి తగ్గుతుందని ఫిర్యాదు చేస్తారు. అలాంటి వారు రోజూ కొంచెం అల్లం తింటే.. అది మీ జీర్ణక్రియను పెంచుతుంది.. అలాగే ఆకలిని పెంచుతుంది.

రక్తంలో చక్కెర నిర్వహణ: అల్లం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది, కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణ: చెడు కొలెస్ట్రాల్ (LDL) గుండెకు చాలా హానికరం.. కాబట్టి దాని స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం చాలా ముఖ్యం. అల్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది: అల్లంలోని శోథ నిరోధక లక్షణాలు శరీరంలోని వాపును తగ్గించడమే కాకుండా నొప్పి నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తాయి. అందువల్ల, ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: అల్లం తినడం వల్ల మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శీతాకాలంలో సంభవించే వైరల్ ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీకు సహాయపడుతుంది.

ఋతుస్రావం సమయంలో నొప్పి నుండి ఉపశమనం: అల్లం టీ తాగడం వల్ల ఋతుస్రావం సమయంలో నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం లభిస్తుంది కాబట్టి అల్లం అమ్మాయిలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: అల్లం తీసుకోవడం వల్ల మీ జీవక్రియను పెంచడం ద్వారా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కాబట్టి, మీ బరువు తగ్గించే ప్రయాణంలో అల్లంను చేర్చుకోవడం మంచిది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం సాధారణ జ్ఞానం కోసం మాత్రమే అందించబడింది. దీన్ని స్వీకరించే ముందు దయచేసి నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.