Zydus Vaccine: గుడ్ న్యూస్.. 18 ఏళ్లలోపు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్.!

సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం దానికి తగిన చర్యలు తీసుకుంటోంది..

Zydus Vaccine: గుడ్ న్యూస్.. 18 ఏళ్లలోపు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్.!
Covid Vaccine
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 09, 2021 | 9:58 AM

సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం దానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అలాగే 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ తరుణంలోనే ఓ గుడ్ న్యూస్ అందించింది.

12 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి జైడస్ వ్యాక్సిన్‌ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తామని డాక్టర్ ఎన్‌కె అరోరా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వివరించారు. రాబోయే వారాల్లో అత్యవసర వినియోగానికి జైడస్ వ్యాక్సిన్‌కు అనుమతులు వస్తాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం పిల్లలపై కోవాగ్జిన్ మూడోదశ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. జైడస్ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్ కూడా సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి.. అనుమతులు లభించిన తర్వాత సెప్టెంబర్ నుంచి 12-18 మధ్య వయస్సువారికి, అలాగే 2022 జనవరి లేదా ఫిబ్రవరి నుంచి 2-18 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలల పున: ప్రారంభం, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుని క్లినికల్ ట్రయిల్స్‌ను వేగవంతం చేస్తున్నామన్నారు.

ఇదిలా ఉంటే నిపుణుల విభాగంతో పాటు దేశ పీడియాట్రిక్ అసోషియేషన్ థర్డ్ వేవ్‌పై అంచనాలు తప్పు కావచ్చునని.. పిల్లలు సురక్షితంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపడుతోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. దేశవ్యాప్తంగా ఉన్న 736 జిల్లాల్లో పిల్లల కోసం పీడియాట్రిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీని తొమ్మిది నెలల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అటు ఢిల్లీ, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు.

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!

గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు