ఆ షేక్ హ్యాండ్ నేను మరిచిపోలేను..ఆ తర్వాత స్నానం చేయొద్దనిపించింది

సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్‌కు మధుర స్మృతులు ఎక్కువే అంటారు. ఆయన మనసు వెన్న.. ప్రతి క్షణం గుర్తుంచుకుంటారు అని ఆయనను ప్రేమించేవారు అనే మాట. అలానే దీపావళి సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ను గుర్తు చేసుకున్నారు...

ఆ షేక్ హ్యాండ్ నేను మరిచిపోలేను..ఆ తర్వాత స్నానం చేయొద్దనిపించింది
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 14, 2020 | 7:12 PM

సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్‌కు మధుర స్మృతులు ఎక్కువే అంటారు. ఆయన మనసు వెన్న.. ప్రతి క్షణం గుర్తుంచుకుంటారు అని ఆయనను ప్రేమించేవారు అనే మాట. అలానే దీపావళి సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ను గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తాన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

క్రికెట్ దేవుడు సచిన్ తెందుల్కర్​ తొలిసారి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తెగ సంతోషపడ్డాడని తెలిపారు. ఎక్కడ ఆ అనుభూతిని కోల్పోతానేమోనని, తనకు స్నానమే చేయాలనిపించలేదని చెప్పారు. మాస్టర్​ బ్లాస్టర్​ అనేక సందర్భాల్లో తనకు ప్రోత్సాహమందించాడని వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయిన ‘స్టోరీస్ బిహైండ్ ది స్టోరీ’ వీడియోలో యువీ ఈ విషయాల్ని తెలిపారు.

అండర్-19 ఆడిన తర్వాత సీనియర్ జట్టులో తనకు చోటు దక్కిందని అన్నారు. నా హీరోలు సచిన్​, గంగూలీ, ద్రవిడ్, కుంబ్లే, శ్రీనాథ్ లాంటి గొప్ప ఆటగాళ్లను చూసి.. నేనెక్కడ ఉన్నానో అని ఆశ్చర్యపోయాను. ఓ సందర్భంలో అందరం బస్సులో వెళ్తున్నాం. నేనేమో వెనుక సీటులో కూర్చున్నాను. అప్పుడే కొత్తగా జట్టులోకి చేరిన నన్ను.. జహీర్ ఖాన్, విజయ్ దహియా, సచిన్ వెనక్కి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వారివారి సీట్లోకి వెళ్లిపోయారు. వెంటనే ఆనందంతో నా చేతులను ఒళ్లంతా రుద్దుకున్నాను. ఆ తర్వాత స్నానం చేయొద్దని అనిపించిందని వెల్లడించారు.

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?