ప్రధానికి లేఖ నా పర్సనల్ : భూమన

విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరావుకు సంబంధించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి తాను రాసిన లెటర్ మీద వివరణ ఇచ్చారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. 81 ఏళ్ల వరవరరావును..

ప్రధానికి లేఖ నా పర్సనల్ : భూమన
Follow us

|

Updated on: Aug 30, 2020 | 4:45 PM

విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరావుకు సంబంధించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి తాను రాసిన లెటర్ మీద వివరణ ఇచ్చారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. 81 ఏళ్ల వరవరరావును విడిపించాలని లేఖ రాయడం పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దీనిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఇంఛార్జ్‌ సునీల్‌ దియోధర్‌ ట్వీట్‌ చేయడం బాధాకరమన్నారు. దీనిపై సునీల్‌ దియోధర్‌కు భూమన వివరణాత్మకంగా ఆదివారం రెండు పేజీల లేఖ రాశారు. ప్రధాని మోదీ పట్ల తనకు అపార గౌరవం ఉందని.. తాను ఆ లేఖలో కోరింది అనారోగ్యంతో బాధపడుతున్న వరవరావు పట్ల జాలి చూపించమని మాత్రమేనని.. అంతే కానీ వరవరరావు భావాజాలాన్ని అంగీకరించి కాదని వివరణ ఇచ్చారు.

ఇలాఉండగా, భీమా కోరేగావ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసి తలోజా జైలుకు తరలించిన సంగతి ఎరుకే. అయితే, అనారోగ్య కారణాల రిత్యా వరవరరావును విడుదల చేయాలని కొన్ని రోజుల క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి భూమన లేఖ రాశారు. దీనిపై దియోధర్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన వరవరరావును విడుదల చెయ్యాలని భూమన కోరడం సమంజసం కాదని సునీల్‌ అన్నారు.