AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో కొత్తగా 8,324 మందికి కరోనా

దేశంలో కరోనా వైరస్ కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. అటు కర్ణాటకలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. రోజురోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 8,324 కొత్త కేసులు నమోదయ్యాయి.

కర్ణాటకలో కొత్తగా 8,324 మందికి కరోనా
Balu
|

Updated on: Aug 30, 2020 | 4:36 PM

Share

దేశంలో కరోనా వైరస్ కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. అటు కర్ణాటకలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. రోజురోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 8,324 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,27,076కు చేరుకుంది. కొత్తగా 115 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 5,438కి పెరిగినట్టు కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, బెంగళూరు అర్బన్ జిల్లాలో 2,993 కేసులు వెలుగు చూడగా, 25 మంది చనిపోయారు. ఫలితంగా నగరంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,24,442కు పెరిగింది. కరోనా కారణంగా నగరంలో ఇప్పటి వరకు 1,911 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.

Follow Us