చంద్రబాబుకు వైసీపీ నేతల వార్నింగ్!

ప్రభుత్వానికి ప్రజాసమస్యలు పట్టడం లేదని, టిడిపి నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, నిన్న అర్థరాత్రి నుంచే ప్రభుత్వ పతనం ప్రారంభమైంది అని తెలిపారు బోండా ఉమ. రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకుల అరెస్టులు లేవు. కొత్త సంస్కృతికి జగన్ ప్రభుత్వం తెరతీసింది అని అశోక్ గజపతిరాజు తీవ్రంగా మండిపడ్డారు. కాగా.. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే అరెస్టులు చేస్తామంటున్నారు అధికార పార్టీకి చెందిన మంత్రులు. రైతులతో రాజకీయం చేయడం తగదని […]

చంద్రబాబుకు వైసీపీ నేతల వార్నింగ్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 09, 2020 | 3:43 PM

ప్రభుత్వానికి ప్రజాసమస్యలు పట్టడం లేదని, టిడిపి నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, నిన్న అర్థరాత్రి నుంచే ప్రభుత్వ పతనం ప్రారంభమైంది అని తెలిపారు బోండా ఉమ. రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకుల అరెస్టులు లేవు. కొత్త సంస్కృతికి జగన్ ప్రభుత్వం తెరతీసింది అని అశోక్ గజపతిరాజు తీవ్రంగా మండిపడ్డారు.

కాగా.. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే అరెస్టులు చేస్తామంటున్నారు అధికార పార్టీకి చెందిన మంత్రులు. రైతులతో రాజకీయం చేయడం తగదని వారుపేర్కొన్నారు. చంద్రబాబుపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చి సీఎం న్యాయం చేశారని పెద్దిరెడ్డి తెలిపారు. రాజధాని భూములు దోచుకోవడంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారని అయన విమర్శించారు. మాపై దాడులు చేస్తే తిరిగి సమాధానం చెబుతామని, టీడీపీ నేతలు రాష్ట్రంలో తిరగలేరని పెద్దిరెడ్డి తెలిపారు.