పాకిస్తాన్ చెర నుంచి.. ఇళ్లకు చేరిన మత్స్యకారులు!
పాకిస్తాన్‌లో 14 నెలలు బందీలుగా ఉన్న మత్స్యకారులు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వస్థలాలకు చేరుకున్న వారిని చూసి.. కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 20 మంది మత్స్యకారులు ఇళ్లకు చేరుకుని ఆత్మీయుల్ని కలుసుకుని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పాక్‌లో తమ అనుభవాలను చెప్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. తమ విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పట్టారన్న నెపంతో వీరిని పాకిస్తాన్ అధికారులు […]
పాకిస్తాన్‌లో 14 నెలలు బందీలుగా ఉన్న మత్స్యకారులు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వస్థలాలకు చేరుకున్న వారిని చూసి.. కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 20 మంది మత్స్యకారులు ఇళ్లకు చేరుకుని ఆత్మీయుల్ని కలుసుకుని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పాక్‌లో తమ అనుభవాలను చెప్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. తమ విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పట్టారన్న నెపంతో వీరిని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా.. పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో కరాచీలోని మాలిర్, లాంధీ జైళ్ల నుంచి మూడు బ్యాచ్‌లలో 260 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పట్టినందుకు భారత మత్స్యకారులను పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఫోర్సెస్ గత ఏడాది ఆగస్టు నుండి 34 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసి, ఆరు పడవలను స్వాధీనం చేసుకున్నారు.