‘కాషాయం’ లో ‘ కషాయం’.. తెలంగాణ బీజేపీకి తలనొప్పి
సీఏఏపై తెలంగాణ బీజేపీలోని ముస్లిం కార్యకర్తల్లో విభేదాలు తలెత్తాయి. ఈ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్ లో పార్టీ నిర్వహించిన సమావేశానికి వీరిలో చాలామంది గైర్హాజరయ్యారు. ఇటీవల నెక్లెస్ రోడ్డులో ముస్లిం సంఘాలు నిర్వహించిన మిలియన్ మార్చ్ కో కూడా వీరు పాల్గొనలేదు. ఈ చట్టంతో బాటు పార్టీ పట్ల కూడా వీరు ఆగ్రహంగా ఉన్నారు. 2018 లో పార్టీ సభ్యత్వ డ్రైవ్ సందర్భంగా తెలంగాణ నుంచి కమలం పార్టీ 40 వేలమంది ముస్లిములను కార్యకర్తలుగా చేర్చుకుంది. అయితే […]

సీఏఏపై తెలంగాణ బీజేపీలోని ముస్లిం కార్యకర్తల్లో విభేదాలు తలెత్తాయి. ఈ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్ లో పార్టీ నిర్వహించిన సమావేశానికి వీరిలో చాలామంది గైర్హాజరయ్యారు. ఇటీవల నెక్లెస్ రోడ్డులో ముస్లిం సంఘాలు నిర్వహించిన మిలియన్ మార్చ్ కో కూడా వీరు పాల్గొనలేదు. ఈ చట్టంతో బాటు పార్టీ పట్ల కూడా వీరు ఆగ్రహంగా ఉన్నారు. 2018 లో పార్టీ సభ్యత్వ డ్రైవ్ సందర్భంగా తెలంగాణ నుంచి కమలం పార్టీ 40 వేలమంది ముస్లిములను కార్యకర్తలుగా చేర్చుకుంది. అయితే పార్లమెంట్ లో సీఏఏ ఆమోదం అనంతరం వీరిలో సగానికి పైగా కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ చట్టం పట్ల తాము తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నామని, పార్టీలో తమ మొర వినేవారే లేరని పలువురు వాపోయారు. పాకిస్తాన్ లోని షియా ముస్లిములు అక్కడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. వారిని అక్కడి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, వారికి న్యాయం జరగడంలేదని అంటున్నారు.
హైదరాబాద్ లో షియా తెగకు చెందిన సుమారు నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి. వీరికి పాకిస్తాన్ లోని కరాచీ, క్వెట్టాలలో బంధువులు ఉన్నారు. తాము బీజేపీతో చేతులు కలిపితే తమకు న్యాయం జరుగుతుందని వీరు ఆశించినా..ఫలితం లేకపోయింది. అని బీజేపీ మైనారిటీ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు ఫరీద్ షేక్ లియాఖత్ అలీ పేర్కొన్నారు. పాక్ సహా మూడు దేశాల్లోని ముస్లిమేతరులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించాలని ఈ చట్టం నిర్దేశిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం వల్ల భారతీయ ముస్లిముల భద్రతకు ఎలాంటి హానీ లేదని ప్రభుత్వం చెబుతున్నా.. తమ వర్గం మాత్రం సంతృప్తి చెందడంలేదని ఆయన అన్నారు.



