YSR Jagananna Shaswata Bhoo Hakku: ఏపీలో చరిత్రాత్మక ఘట్టం..శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ పేరుతో భూముల రీ సర్వేను ప్రారంభించింది ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ పేరుతో భూముల రీ సర్వేను ప్రారంభించింది ప్రభుత్వం. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద సర్వేరాయి పాతి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. భూముల రీసర్వే వివరాలు, సర్వే కోసం వినియోగించే పరికరాలను, సర్వే ద్వారా కలిగే ఫలితాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని మూడుదశల్లో చేపట్టి 2023 జనవరి నాటికి పూర్తి చేయాలని ఏపీ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది.
LIVE NEWS & UPDATES
-
ప్రజల దీవెనలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజలకు మంచే చేస్తుంది
ఈ 18 నెలల కాలంలో వ్యవస్థలో ఎటువంటి అవినీతి లేకుండా ముందుకెళ్లామని..విప్లవాత్మకంగా పథకాలు తీసుకున్నామని..అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లామన్నారు. ప్రజల దీవెనలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం మంచి మాత్రమే చేస్తుందన్నారు.
-
జగ్గయ్యపేటకు సీఎం జగన్ వరాలు
జగ్గయ్యపేటలో పారిశ్రామిక హబ్ చేయడానికి కావాల్సిన వనరులు ఉన్నాయని.. తర్వలో విశ్లేశించి..ఉత్తర్వులు ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి కోసం రూ.5 కోట్ల డబ్బు స్థానిక శాసనభ్యులు ఉదయభాను అడిగారని..వాటిని వెంటనే మంజూరు చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాలకు కూడా రూ.15 కోట్లు వెంటనే వేస్తున్నట్లు వెల్లడించారు. ట్రామా కేర్ సెంటర్ కోసం రూ.3 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని వివరించారు. ఎర్రకాలువ, వేపల వాగు డెవలప్‌మెంట్ కోసం ఐదు కోట్లు వెంటనే శాంక్షన్ చేస్తున్నట్లు సీఎం చెప్పారు. జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు కావాలని ఉదయభాను అడిగారని, ఈ విషయంపై కేంద్రానికి సిఫార్సు చేస్తానన్నారు సీఎం జగన్.
-
-
మనం దేశానికి ఆదర్శం అవ్వబోతున్నాం..జగన్
ఆంధ్రరాష్ట్రంలో మొదలయ్యే ఈ విప్లవం దేశానికి ఆదర్శం అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీలో భూములు కొంటే ఎక్కడ ఉన్నా..ఇబ్బంది ఉండదని అనుకునే రోజులు వస్తాయన్నారు. పారదర్శకంగా, వివాదాలకు, అవినీతికి తావు లేకుండా..గ్రామాల్లోనే, ప్రజల ముంగిటనే భూముల లావాదేవీలు జరగబోతున్నాయని సీఎం చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులన్నీ…ప్రక్షాణన అవుతాయని సీఎం చెప్పారు.
-
భూమి సంబంధించి అన్ని వివరాలు సచివాలయాల్లో దొరుకుతాయి
పైసా పైసా కూడబెట్టి సంపాదించిన భూమి వివాదంలోకి వెళ్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని తాను పాదయాత్రలో గమనించానని చెప్పారు. సామాన్యుడి భూమికి రక్షణ కోసమే ఈ పథకం ప్రారంభించినట్టు సీఎం తెలిపారు. ఈ డిజిటల్ రికార్డ్స్ ఎవరూ ట్యాంపర్ చేయలేరని సీఎం చెప్పారు. ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు గ్రామ సచివాలయాల్లోని జరగబోతున్నాయి అని సీఎం చెప్పారు. భూమి సంబంధించి అన్ని వివరాలు సచివాలయాల్లో దొరుకుతాయని సీఎం చెప్పారు.
-
భూమిపై టైటిల్ ఇచ్చే హక్కు ఏ శాఖకూ లేదు
భూమిపై టైటిల్ ఇచ్చే హక్కు ఏ శాఖకూ లేదని సీఎం జగన్ చెప్పారు. భూతద్దంతో వెతికినా తప్పుల్లేని విధంగా రికార్డులు ఉండేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ మ్యాప్ ఇస్తామని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించనున్నట్లు సీఎం వెల్లడించారు.
-
-
అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం సులువవుతుంది
ఆస్తుల రికార్డులు పక్కాగా ఉంటే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం సులువవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజల భూములకు ప్రభుత్వం పూర్తి రక్షణగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తుల రికార్డులు పదిలంగా ఉండాలనే ఉద్దేశంతో వందేళ్ల తర్వాత భూముల సర్వే చేపడుతున్నట్లు సీఎం జగన్ వివరించారు.
-
2023 నాటికి భూ రీసర్వే పూర్తి చేస్తాం
డ్రోన్, రోవర్ ద్వారా అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సర్వే చేయబోతున్నట్లు సీఎం చెపప్ారు. అస్తవ్యస్తంగా వివిధ శాఖల్లో ఉన్న రికార్డులను సరిచేస్తామని మఖ్యమంత్రి తెలిపారు. నాలుగు శాఖల వద్ద డాక్యుమెంట్లు ఉండటం వల్ల..ఇప్పటివరకు సామాన్యులు ఎన్నో కష్టాలు పడ్డారని..ఇకపై అలాంటివి ఉండవని చెప్పారు. 2023 నాటికి భూ రీసర్వే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడుతుందని పేర్కొన్నారు.
-
సర్వే రాళ్లు కూడా ప్రభుత్వ నిధులతోనే
పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే తక్కెళ్లపాడులో భూ రీసర్వే చేశామని సీఎం జగన్ చెప్పారు. భూ రీసర్వే కోసం అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతోనే సర్వే రాళ్లను కూడా వేస్తామని స్పష్టం చేశారు. ప్రతి భూమికి ఐడీ నంబర్ ఇస్తాం సీఎం జగన్ తెలిపారు.
-
గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వ హామీతో కూడిన భూహక్కు పత్రాన్ని యజమానికి అందిస్తామని… భూమి విస్తీర్ణంతో కూడిన ల్యాండ్ మ్యాప్‌ను కూడా అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. ప్రతి గ్రామానికి సర్వే మ్యాప్ ఉంటుందని… గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్ చెప్పారు
-
మీ భూమి రక్షణకు.. మాది బాధ్యత
భూములపై వివాదాలు సృష్టించే కబ్బాకోరుల నుంచి ప్రజలకు రక్షణ అవసరమని సీఎం జగన్ పేర్కొన్నారు. పాదయాత్రలో అనేకమంది బాధితుల కష్టాలు విన్నానని. ప్రజలకు భూమి రక్షణకు.. తమ ప్రభుత్వం రక్షణ ఇస్తుందని సీఎం చెప్పారు.
-
ఈ పథకం వల్ల రైతులకు ఎన్నో లాభాలు : సీఎం జగన్
భూమి కొలత, ఆకారం ఎలా ఉందో..అదే రికార్డులు కనిపించబోతుందని సీఎం చెప్పారు. గిట్టనివారు, కబ్జా రాయుళ్లు హద్దు రాళ్లు తీసేసినా..గెట్లు తెగ్గొట్టినా…భూమి రికార్డుల్లో మాత్రం అసలు నిజాలుంటాన్నారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తినా కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం ఉండదన్నారు. వందేళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతుందని చెప్పారు. గడిచిన ఈ 100 సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.
-
ఇలాంటి కార్యక్రమానికి ఏ రాష్ట్రం పూనుకోదు : సీఎం జగన్
మీ అందరి ప్రేమతో, ఆప్యాయతతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమానికి ఏ రాష్ట్రం కూడా సాహసించదని..కానీ ప్రజలకు మంచి జరగాలనే ఆరాటంతో ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16,000 మంది సర్వేయర్లను రిక్రూట్ చేసుకున్నామని చెప్పారు. బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో..భూమి మీద రైతుకు కూడా అంతే ప్రేమ ఉంటుందని సీఎం చెప్పారు. భూమి రైతుకు ప్రాణ సమానమని చెప్పారు.
-
జగ్గయ్యపేటను పారిశ్రామిక హబ్ చేయాలని సీఎంను కోరుతున్నా : సామినేని
జగ్గయ్యపేటలో ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని..ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్ హబ్‌గా మార్చాలని సీఎంను సామినేని ఉదయభాను కోరారు. హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గయపేటలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. అలా ఈఎస్‌ఐ ఆస్పత్రి కూడా జగ్గయ్యపేటకు కేటాయించాలని కోరారు. ఇప్పటివరకు తమ ప్రాంతానికి గూడ్స్ రైలు సౌకర్యం ఉందని..పాసింజర్ రైలు సౌలభ్యం కూడా కల్పించాలని కోరారు.
-
కరోనాపై పోరులో సీఎం జగన్ తీరు అభినందనీయం : సామినేని
కరోనాపై పోరులో సీఎం జగన్ తీసుకున్న సమర్థవంతమైన నిర్ణయాలు వ్యాధి వ్యాప్తిని అడ్డుకోగలిగాయని సామినేని తెలిపారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే..కోటి మందికి టెస్టులు చేశారు..దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా టెస్టులు చేయలేదన్నారు. అన్ని రంగాలతో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఈబీసీలకు ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం జగన్ అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు
-
జగ్గయ్యపేటకు సీఎం జగన్ వరాలు ఇవ్వబోతున్నారు : సామినేని
ఒకప్పుడు పొలం సర్వే చేయాలంటే..చలాన్లు కట్టాల్సి వచ్చేదని…సర్వేయర్లు అందుబాటులో ఉండేవారు కాదని..రైతుల మధ్య గొడవలు ఎక్కువగా జరిగేవని..తాజాగా తీసుకొచ్చిన పథకంలో ఆ ఇబ్బందులు అన్నీ ఉండవన్నారు. సర్వే ఆఫ్ ఇండియా ఇందులో భాగమవ్వడం గొప్ప విషయమని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సీఎం జగన్ పుట్టినరోజున జగ్గయ్యపేటకు రావడం ఆనందకరమన్నారు. జగన్ పుట్టినరోజున నియోజకవర్గానికి కొన్ని వరాలు అందించబోతున్నట్లు తెలిపారు.
-
జగ్గయ్యపేట నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు : సామినేని
వైఎస్సార్– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని జగ్గయ్యపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఏపీ ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను. సీఎం జగన్ పెళ్లి రోజున నియోజకవర్గానికి వైఎస్సార్ ఎత్తిపోతల పథకాన్ని అందించారని..పుట్టిన రోజున రైతాంగానికి మేలు చేసే శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.