ఛలో స్విట్జర్లాండ్… సమ్మర్ క్యాంప్
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి శీతల ప్రదేశాలకు వెళ్తుంటారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో నిత్యం ప్రత్యుర్థులపై విరుచుకుపడే రాజకీయ నేతలు కూడా చల్లబడడం కోసం శీతల ప్రదేశాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్ కూడా వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్తున్నారు. సుందర ప్రాంతమైన స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ రోజు జగన్ హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్ బయల్దేరనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఐదురోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జగన్ […]
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి శీతల ప్రదేశాలకు వెళ్తుంటారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో నిత్యం ప్రత్యుర్థులపై విరుచుకుపడే రాజకీయ నేతలు కూడా చల్లబడడం కోసం శీతల ప్రదేశాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్ కూడా వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్తున్నారు. సుందర ప్రాంతమైన స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు.
ఈ రోజు జగన్ హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్ బయల్దేరనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఐదురోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జగన్ విడిది చేయనున్నారు. తిరిగి ఈనెల 27 రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. గత సంవత్సరం వేసవిలో కుటుంబసభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లారు. న్యూజిలాండ్‌లో జగన్ బంగీజంప్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి.