షాకింగ్: గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు.. ప్రమాదంలో యూజర్ల వివరాలు..

ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్న వాట్సాప్.. ఇప్పుడు వాటిల్లో ఉన్న బగ్ కారణంగా అనేక మంది యూజర్ల గోప్యత ప్రమాదంలో పడేస్తోంది.

షాకింగ్: గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు.. ప్రమాదంలో యూజర్ల వివరాలు..
Follow us

|

Updated on: Jun 07, 2020 | 5:19 PM

ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్న వాట్సాప్.. ఇప్పుడు వాటిల్లో ఉన్న బగ్ కారణంగా అనేక మంది యూజర్ల గోప్యత ప్రమాదంలో పడేస్తోంది. ఆ బగ్ గూగుల్ సెర్చ్ ఫలితాల్లో యూజర్ల వాట్సాప్ నెంబర్లు కనిపించేలా చేస్తోంది. ‘వాట్సాప్ క్లిక్ టూ చాట్ ఫీచర్‌లోని ఓ బగ్ సోషల్ మెసేజింగ్ సైట్ యొక్క వినియోగదారుల ఫోన్ నంబర్లను గూగుల్ సెర్చ్‌ను ఇండెక్స్ చేయడానికి అనుమతించడంతో ఈ ముప్పు ముంచుకొచ్చింది. ఇది ఎవరినైనా కూడా వెబ్‌లో వినియోగదారుల ఫోన్ నంబర్‌లను వెతకడానికి అనుమతిస్తుంది. తద్వారా వాట్సాప్ యూజర్ల గోప్యత ప్రమాదంలో పడుతుందని బగ్ బౌంటి హంటర్ అతుల్ జయరాం తెలిపారు.

Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి బోర్డర్‌లో తనిఖీల్లేవు..

దీనితో క్లిక్ టూ చాట్ ఒక యూజర్ నుంచి మరో యూజర్‌తో వారి ఫోన్ నెంబర్‌ను సేవ్ చేసుకోకుండానే చాట్ చేసేందుకు అనుమతిస్తుంది. అంతేకాక వెబ్‌సైట్లు తమ విజిటర్స్‌తో నేరుగా సంప్రదించునే అవకాశం కూడా ఉంటుంది. గూగుల్ సెర్చ్‌లో సాధారణ టెక్స్ట్ రూపంలో యూజర్ల నెంబర్లు కనబడటం వల్ల స్కామర్లు వాటన్నింటిని సేకరించే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు నాకు గూగుల్‌లో 3,00,000 ఇండెక్స్ నెంబర్స్ కనిపించినట్లు అతుల్ జయరాం పేర్కొన్నారు.

Also Read: పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

యూజర్ల వ్యక్తిగత ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో లీక్ అయితే.. స్కామర్లు వారికి మెసేజ్, లేదా కాల్ చేయవచ్చు. అంతేకాకుండా స్పామర్లు, సేల్స్ మార్కెటింగ్ ఏజెన్సీలకు కూడా వారి ఫోన్ నెంబర్లను అమ్మే అవకాశం ఉందన్నారు. మే 23వ తేదీన అతుల్ ఈ బగ్‌ను కనుగొన్నారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌ను దాని బగ్-బౌంటీ ప్రోగ్రాం ద్వారా సంప్రదించారు. అయితే, కంపెనీ దీనిపై స్పందిస్తూ కంపెనీ డేటా అబ్యూస్ ప్రోగ్రాంలో వాట్సాప్ చేరలేదని పేర్కొంది. కాగా, వాట్సాప్ యూజర్లు ఒక్క క్లిక్ ద్వారా అసత్య, అవాంఛిత మెసేజ్‌లను బ్లాక్ చేయవచ్చునని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: 

భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి..

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..