AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో నిఖిల్.. అనుపమ, కలర్స్ స్వాతిలకు విసిరిన ఛాలెంజ్..!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్‌‌ను స్వీకరించి..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో నిఖిల్.. అనుపమ, కలర్స్ స్వాతిలకు విసిరిన ఛాలెంజ్..!
Ravi Kiran
|

Updated on: Nov 18, 2020 | 9:44 AM

Share

Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్‌‌ను స్వీకరించి నేడు గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో హీరో నిఖిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా బాగుందన్నారు. ”మనం స్టాలిన్ సినిమాలో చూశాం. ఒకరు ముగ్గురికి సహాయం చేయాలని.. అదే విధంగా ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేస్తారు. ఇక్కడ కూడా అదే విధానాన్ని పాటిస్తూ సంతోష్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కూడా సీడ్ గణేష్ పేరు మీద పర్యావరణ పరిరక్షణ కోసం తన కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగిందని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం సంతోష్ చేపట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుందని నిఖిల్ తెలిపారు. కాగా, ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగడం కోసం ’18 పేజీలు’ చిత్ర బృందం సభ్యులు, హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, అవికా గౌర్, కలర్స్ స్వాతిలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Also Read: 

‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..

రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..

#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?

బాలుడి అదృశ్యంపై కలకలం.. కిడ్నాపర్ల బేరం..