మరోసారి అలా అంటే వాతలు పెడతారు: వైసీపీ నేత అంబటి రాంబాబు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటైన విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి పాలన అందిస్తున్న వైసీపీ పాలనను విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని , చంద్రబాబుకు కనీసం ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు అనేక విషయాల్లో పంచాయతీలు చేసి.. ఇప్పుడు తమ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మార్వో వనజాక్షి, చింతమనేని […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటైన విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి పాలన అందిస్తున్న వైసీపీ పాలనను విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని , చంద్రబాబుకు కనీసం ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు అనేక విషయాల్లో పంచాయతీలు చేసి.. ఇప్పుడు తమ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మార్వో వనజాక్షి, చింతమనేని కేసు, ఐపీఎస్ అధికారికి ఎంపీ కేశినేనికి మధ్య పంచాయతీలు నడిపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. పులివెందుల పంచాయతీ అని మరోసారి అంటే ప్రజలు వాతలు పెడతారని, కరకట్ట మీద అక్రమ కట్టడంలో నివసిస్తూ చంద్రబాబు పంచాయతీలు పెడుతున్నారని అంబటి ఆరోపించారు. సీఎం జగన్ ప్రారంభించిన కంటివెలుగు పథకాన్ని.. చంద్రబాబు ఎప్పుడో చేశామంటూ అసత్య ప్రచారానికి తెరతీస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ విధానాలు నచ్చకపోవడంతోనే ప్రజలు ఆపార్టీని మూలన కూర్చోబెట్టారంటూ ఆయన ఫైరయ్యారు.