నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. గత 30ఏళ్లుగా మనం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా ఏడాదేడాదికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల వలన జరిగే పరిణామాలపై చర్చించుకునేందుకు 1989లో ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1987 జూన్ 11న ప్రపంచ జనాభా 500కోట్లు దాటగా.. దానిపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఏ దేశమైనా […]

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 11:33 AM

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. గత 30ఏళ్లుగా మనం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా ఏడాదేడాదికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల వలన జరిగే పరిణామాలపై చర్చించుకునేందుకు 1989లో ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1987 జూన్ 11న ప్రపంచ జనాభా 500కోట్లు దాటగా.. దానిపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

అయితే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. మానవ వనరులు చాలా అవసరం. కానీ జనాభా పెరిగితే వనరులు తగ్గిపోతాయి. ఇప్పటికే చాలా దేశాల్లో నీటికి విపరీతమైన కొరత ఉంది. ఎన్నో దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు అంతర్యుద్ధాలు, ఆక్రమణలు, ఉగ్రదాడులు జరగనే జరుగుతున్నాయి. ఇవన్నీ అంశాతి వల్ల తలెత్తే పరిణామాలు. ఈ అశాంతికి కారణాల్లో జనాభా పెరుగుదల కూడా ఒకటిగా కనిపిస్తోంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికైనా జనాభాను తగ్గించగలగాలి.

కాగా ప్రస్తుతం అధిక జనాభా కలిగిన దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. మరో పదేళ్లలో ఈ విషయంలో చైనాను మించుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలానే జరిగితే భారత్‌ మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా జనాభా పెరుగుదల వలన నష్టాలే ఉన్నాయి. అది దేశాభివృద్ధిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికైనా దీనిపై అందరిలో చైతన్యం కలిగి.. జనాభా తగ్గుదలపై దృష్టి పెరగాలి. దాని వలన భవిష్యత్‌లో వచ్చే ఎన్నో సమస్యలను మనం కాస్తైనా అరికట్టవచ్చు.