AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women abuse: డిగ్రీ పిల్లలను బాత్రూం తీసుకెళ్లి… అండర్ వేర్లు విప్పించి… ఆ పరీక్ష..!!

women abuse: మన దేశంలో శృంగారం, ఆడవారిలో రుతుక్రమం గురించి మాట్లాడుకోవడాన్ని చాలా మంది తప్పుగా చూస్తుంటారు. మనం కాలం బాగా మారిపోయింది అనే భ్రమల్లో ఉన్నాం… కానీ మారలేదు… మారనివ్వడం లేదు… అంతెందుకు మార్పుకి వేదికలు కావాల్సిన యూనివర్శిటీలు, కాలేజీలే ఆ మార్పులకు ప్రతిబంధకాల్లా మారిపోయాయి… ఏ విషయంలో అంటారా..? ఆ రుతుస్రావం రోజుల్లో మహిళలు ఎదుర్కునే వివక్ష గురించి..! ఔను.. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఆ రోజుల్లో వారిని దూరం ఉంచుతున్నారు… కొన్ని మారుమూల […]

Women abuse: డిగ్రీ పిల్లలను బాత్రూం తీసుకెళ్లి... అండర్ వేర్లు విప్పించి... ఆ పరీక్ష..!!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 6:30 PM

Share

women abuse: మన దేశంలో శృంగారం, ఆడవారిలో రుతుక్రమం గురించి మాట్లాడుకోవడాన్ని చాలా మంది తప్పుగా చూస్తుంటారు. మనం కాలం బాగా మారిపోయింది అనే భ్రమల్లో ఉన్నాం… కానీ మారలేదు… మారనివ్వడం లేదు… అంతెందుకు మార్పుకి వేదికలు కావాల్సిన యూనివర్శిటీలు, కాలేజీలే ఆ మార్పులకు ప్రతిబంధకాల్లా మారిపోయాయి… ఏ విషయంలో అంటారా..? ఆ రుతుస్రావం రోజుల్లో మహిళలు ఎదుర్కునే వివక్ష గురించి..!

ఔను.. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఆ రోజుల్లో వారిని దూరం ఉంచుతున్నారు… కొన్ని మారుమూల ప్రాంతాల్లోనయితే ఇప్పటికీ పిరియడ్స్ రోజుల్లో మహిళలను ఊరవతల ప్రత్యేకంగా ఉండే కొట్టాల్లో ఉంచేస్తున్నారు… చివరకు పరిశుభ్రత, ఆరోగ్యం విషయాల్లో కూడా అశ్రద్ధ, అలక్ష్యమే… గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటన డిస్టర్బింగుగా ఉంది… అది గుజరాత్‌లోని భుజ్…

భుజ్‌లో స్వామి నారాయణ్ ద్విశతాబ్ది మెడికల్‌ అండ్‌ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌‌ నడుస్తోంది.… కాకపోతే కొన్ని విశ్వాసాలను, ఆచారాల్ని విద్యార్థినులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది… అందులో ఒకటి రుతుస్రావం రోజుల్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉండొద్దు, విడిగా ఉండాలి… హాస్టల్ కిచెన్‌ వైపు గానీ, అక్కడికి దగ్గరలో ఉండే ప్రార్థనమందిరం వైపు గానీ వెళ్లకూడదు… బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులున్నయ్… దాదాపు 1500 స్ట్రెంత్… దూరంగా ఉండే పల్లెల నుంచి వచ్చినవాళ్లూ బోలెడు మంది… కొందరు కాలేజీ, హాస్టల్ రూల్స్ అస్సలు పాటించడం లేదట.

ఈ క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ అత్యంత దుర్మార్గపు నిర్ణయం తీసుకుంది. క్లాసులు జరుగుతున్నయ్… కొందరు పిల్లలు కాలేజీ, హాస్టల్ పెట్టిన నిబంధనల్ని, రుతుస్రావం రోజుల్లో పాటించాల్సిన పద్ధతుల్ని ఇగ్నోర్ చేస్తున్నారని సదరు హాస్టల్ రెక్టార్ ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ చేసింది.., సదరు ప్రిన్సిపాల్‌కు చిర్రెత్తింది… పరుగుపరుగున క్లాస్ రూం దాకా వచ్చింది… పిరియడ్స్ రోజుల్లోనూ ఇలా క్యాంపసులో ఎలాపడితే అలా తిరుగుతున్నది ఎవరో చెప్పమని గద్దించింది… అందరూ తలలు దించుకున్నారు… విషయం తేలలేదు… దాంతో ఆమె 68 మంది పిల్లలను బాత్‌రూం దగ్గరకు తీసుకుపోయింది… అందరూ వరుసలో నిలబడ్డారు.

పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు వాళ్ల లో దుస్తులను విప్పించింది. ఒకరి తరువాత ఒకరు… తమ దుస్తులు విప్పి, అండర్ వేర్స్ కూడా తీసి… రుతుస్రావం జరగడం లేదని, తాము ‘ఆ రోజుల్లో’ లేమని నిరూపించుకోవాల్సి వచ్చింది… ఇది తమను అవమానించడమే అని కొందరు విద్యార్థినులు ఫైరయ్యారుట… తరువాత మొక్కుబడిగా సదరు యూనివర్శిటీ ఓ నిజనిర్ధారణ కమిటీని వేసిందట… అంతే… అంతకుమించి ఇంకేమీ జరగదు… అవునూ… ఇలాంటి కాలేజీలు ‘మూఢ వివక్షలు- అశాస్త్రీయ నమ్మకాల’ను దూరం చేస్తాయా..? ఇంకా పటిష్టం చేస్తాయా..? ఇవా మన కాలేజీలు..?! వోకే, అది మా విశ్వాసం, మా పద్ధతి అంటారేమో… పోనీ, కిచెన్‌లోకి, గుడిలోకి రాకుండా ఆంక్షలూ సరే అనుకుందాం… తోటి విద్యార్థులతో కలవకూడదు అనడం, విడిగా ఉండాలనడం… ఇంకా ఏ రోజుల్లోకి తీసుకుపోతున్నారో మనల్ని..?!