అంబులెన్స్‌లో గర్భిణి.. అడ్డు తగిలిన సింహాలు.. చివరికి..

Woman delivers baby: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం తిరిగి ప్రారంభమైంది. అయితే.. గుజరాత్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గిర్‌సోమనాథ్ జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో నాలుగు సింహాలు ఆ అంబులెన్స్‌కు అడ్డు తగిలాయి. కాగా.. ఆ సింహాలు ఎంతసేపటికీ కదల్లేదు. రాత్రి వేళ కావడం, పైగా వెళ్లడానికి వేరే మార్గం […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:34 pm, Thu, 21 May 20
అంబులెన్స్‌లో గర్భిణి.. అడ్డు తగిలిన సింహాలు.. చివరికి..

Woman delivers baby: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం తిరిగి ప్రారంభమైంది. అయితే.. గుజరాత్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గిర్‌సోమనాథ్ జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో నాలుగు సింహాలు ఆ అంబులెన్స్‌కు అడ్డు తగిలాయి.

కాగా.. ఆ సింహాలు ఎంతసేపటికీ కదల్లేదు. రాత్రి వేళ కావడం, పైగా వెళ్లడానికి వేరే మార్గం లేకపోవడంతో చేసేదేమీ లేక ఆ అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. ఆ గర్భిణి అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు 20 నిమిషాల పాటు అంబులెన్స్‌ను అడ్డగించిన ఆ నాలుగు సింహాలు ఎట్టకేలకు అడవిలోకి వెళ్లిపోయాయి. దీంతో.. అంబులెన్స్‌లో ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read: ఏపీలో మారిన రూల్స్.. కంటైన్మెంట్ జోన్ల పరిధి కుదింపు..