ఎక్కడైనా సరే… మేం సిద్ధం: సయ్యద్‌ అక్బరుద్దీన్‌

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపై ఎదుర్కోవడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్‌ స్పందిస్తూ..‘‘వారు(పాక్‌) వివిధ వేదికలపై మనల్ని ఎదుర్కోవాలని భావిస్తే.. అదే వేదికలపై వాటిని తిప్పికొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వారు ఇప్పుడు ఐసీజేకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:32 am, Wed, 21 August 19
ఎక్కడైనా సరే... మేం సిద్ధం: సయ్యద్‌ అక్బరుద్దీన్‌

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపై ఎదుర్కోవడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్‌ స్పందిస్తూ..‘‘వారు(పాక్‌) వివిధ వేదికలపై మనల్ని ఎదుర్కోవాలని భావిస్తే.. అదే వేదికలపై వాటిని తిప్పికొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వారు ఇప్పుడు ఐసీజేకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఓసారి ప్రయత్నించి విఫలమయ్యారు’’ అని అక్బరుద్దీన్‌ ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా గత వారం కశ్మీర్‌పై ఐరాస భద్రతా మండలిలో జరిగిన సమావేశాన్ని అక్బరుద్దీన్‌ ప్రస్తావించారు. అవి కేవలం రహస్య సంప్రదింపులేనని స్పష్టం చేశారు. అదే భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ మద్దతు ఉందనడాకి నిదర్శనమని వివరించారు. అలాగే కుల్‌భూషణ్‌ విషయంలో ఐసీజేలో భారత్‌ దౌత్యపరంగా పైచేయి సాధించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.